ఆమనగల్లు : బీఆర్ఎస్ పార్టీకి భయపడి ఆమనగల్లో బీజేపీ కాంగ్రెస్ ఒక్కటయ్యారు బీఆర్ఎస్ నాయకుడు ఉప్పల వెంకటేష్ అన్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీని అనైతికంగా కాంగ్రెస్ చేజిక్కుంచుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేవుడి మీద ప్రమాణం చేసి పార్టీ మారను అని చెప్పి, పార్టీ మారిన కౌన్సిలర్ పత్య నాయక్‌కు పుట్టగతులు ఉండవు అన్నారు. కాంగ్రెస్ పార్టీ 15 వార్డుల్లో ఒక్క వార్డు గెలిచి సిగ్గు లేకుండా మున్సిపాలిటీ కైవసం చేసుకున్నామని ఎలా చెప్తున్నారని మండిపడ్డారు.
మా బీఆర్ఎస్ ఏడుగురు కౌన్సిలర్లతో రాజీనామా చేయిస్తా, మీకు దమ్ముంటే మీ కౌన్సిలర్లతో రాజీనామా చేయించి మళ్లీ గెలవాలని సవాల్ చేశారు. అసెంబ్లీలో బూతులు తిట్టుకునే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ చైర్మన్ కోసం ఒక్కటయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ రెండు పార్టీలు చేసిన దౌర్జన్యాన్ని ప్రజలు గమనించారు, వాళ్లే మీకు బుద్ధి చెప్తారన్నారు. మాకున్న ఏడుగురు కౌన్సిలర్లతో మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటామన్నారు.