Rainfall | ఆగస్టులోనూ తక్కువ వర్షాలే!.. రానున్న మూడురోజులు మోస్తరు వానలు
Rainfall | ఆగస్టులోనూ దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుందని శాటిలైట్ చిత్రాల ఆధారంగా వాతావరణ శాఖ వెల్లడించింది. పసిఫిక్ మహాసముద్రంపై మోస్తరు ఎల్ నినో కొనసాగుతుండటంతో నైరుతి రుతుపవనాలు ఎప్పుడైనా బలహీనపడే అవకాశమున్నదని అంచనా వేసింది.
Rainfall | హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : ఆగస్టులోనూ దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుందని శాటిలైట్ చిత్రాల ఆధారంగా వాతావరణ శాఖ వెల్లడించింది. పసిఫిక్ మహాసముద్రంపై మోస్తరు ఎల్ నినో కొనసాగుతుండటంతో నైరుతి రుతుపవనాలు ఎప్పుడైనా బలహీనపడే అవకాశమున్నదని అంచనా వేసింది. దీని ప్రభావంతో ఆగస్టులో సాధారణ వర్షపాతం కంటే 94 శాతం వరకు తక్కువగా నమోదు కావొచ్చని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. ఆగస్టు నెల కూడా లోటు వర్షపాతంతోనే ప్రారంభమైంది. సోమవారం వరకు 10.3 మి.మీ వర్షపాతం నమోదైంది. జూలైలో 227.4 మి.మీ సగటు వర్షపాతం కురువాల్సి ఉండగా, 224 మి.మీ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.
సముద్రమట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి ప్రస్తుతం బికనీర్, ఢిల్లీ, లక్నో, పాట్నా మీదుగా మణిపూర్ వైపు కొనసాగుతూ సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉన్నదని, ఇది ఉత్తర అంతర్గత కర్ణాటక నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక, కేరళ, తమిళనాడు మీదుగా కొమెరిన్ వరకు సముద్రమట్టానికి 5.8 కి.మీ ఎత్తులో ద్రోణి బలహీనపడిందని తెలిపారు. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులపాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు.
సోమవారం ఆదిలాబాద్, కుమ్రం భీం, మంచిర్యాల, నిర్మల్, నల్లగొండ, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో వర్షాలు కురిసినట్టు తెలిపారు. గడిచిన 24 గంటల్లో వికారాబాద్ జిల్లా కొడంగల్లో 10.43 సెం.మీ., కామారెడ్డి జిల్లా పిట్లంలో 10.38, సంగారెడ్డి సిర్గాపూర్లో 8.40, హైదరాబాద్ బండ్లగూడలో 7.78 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- August
- IMD report
- rainfall
- Rains
RELATED ARTICLES
తాజా వార్తలు
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

