తోర్నాలలో వీరగల్లు శిల్పం లభ్యం
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం తోర్నా లలో రాష్ట్రకూటుల (10, 11వ శతాబ్దం) కాలానికి చెందిన వీరగల్లు శిల్పాలను గుర్తించినట్లు ఔత్సాహిక చరిత్రకారుడు కొలిపాక శ్రీనివాస్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. గ్రామంలోని దుర్గమ్మ ఆలయానికి వెళ్లే దారిలో చెట్ల పొదల్లో ఈ విగ్రహం లభ్యమైనట్లు తెలిపారు.
- రాష్ట్రకూటుల కాలం నాటి శిల్పంగా గుర్తింపు
మద్దూరు(ధూళిమిట్ట), ఆగస్టు 3: సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం తోర్నా లలో రాష్ట్రకూటుల (10, 11వ శతాబ్దం) కాలానికి చెందిన వీరగల్లు శిల్పాలను గుర్తించినట్లు ఔత్సాహిక చరిత్రకారుడు కొలిపాక శ్రీనివాస్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. గ్రామంలోని దుర్గమ్మ ఆలయానికి వెళ్లే దారిలో చెట్ల పొదల్లో ఈ విగ్రహం లభ్యమైనట్లు తెలిపారు. రెండు అంతస్తులుగా చెక్కిన ఈ శిల్పం, ఆత్మార్పణ వీరగల్లు అని తెలిపారు.
మొదటి అంతస్తులో వీరుడి నడినెత్తిన కొప్పుకట్టి, ఆ సిగముడికి పొడుగాటి రుమాలు పట్టికట్టి ఉందన్నారు. వీరుడి తొడలమీదికి పొట్టిలాగు, నడుమున నడికట్టు, ముంజేతులకు దండరెట్టలకు కడియాలతో, చెవులకు పెద్ద కుండలాలు ధరించి ఉందన్నారు. కుడి చేతిలో ఎత్తిపట్టుకున్న కత్తి భుజానికి ఆనించి ఉన్నట్లు తెలిపారు.
ఎడమ చేతిలో శివలింగం పట్టుకొని కనిపిస్తున్నట్లు తెలిపారు. కుడి చేత్తో పట్టుకున్న కత్తితో ఆయన తల నరుక్కొని ఆత్మార్పణం చేసుకున్నట్లు కనిపిస్తుందన్నారు. వీరుడిపైన ఉన్న రెండో అంతస్తులో ఇద్దరు అమరంగణాల మధ్య ఆత్మార్పణం చేసుకున్న ఆ వీరుడు కనిపిస్తున్నట్లు తెలిపారు. ఈ శిల్పం శైలిని బట్టి ఇది ఆత్మార్పణ వీరగల్లు అని, ఇలాంటి శిల్పాలు శైవుల వీరభక్తికి నిదర్శనాలు అని కొలిపాక శ్రీనివాస్ తెలిపారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

