హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 16: ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రైవేట్ హాస్టల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 27న హనుమకొండ నయీంనగర్‌లోని జే కన్వెన్షన్ హాల్లో సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు కాకతీయ ప్రైవేట్ హాస్టల్స్అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు కాసు శ్రీనివాస్‌రెడ్డి, గౌరవాధ్యక్షుడు కోలుగూరి సుగుణాకర్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం హనుమకొండలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు.
పెరిగిన నిత్యవసర సరుకుల వలన హాస్టల్స్ఓనర్స్పడుతున్న ఇబందులు, పెరగని హాస్టల్ ఫీజులు, ప్రైవేట్ హాస్టల్స్ఓనర్లకు ఇన్సూరెన్స్, ఐడీ కార్డ్స్తదితర అంశాలపై చర్చించేందుకు సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని ప్రైవేట్ హాస్టల్స్ఓనర్లు హాజరుకావాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాకతీయ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రైవేట్ హాస్టల్స్అసోసియేషన్ పెద్దలు, కమిటీ సభ్యులు, కార్యవర్గ సభ్యులు, వివిధ హాస్టళ్ల ఓనర్లు పాల్గొన్నారు.