ఆస్ట్రేలియా : బీఆర్ఎస్ అధినేత, ఉద్యమ నాయకుడు కేసీఆర్ జన్మదిన వేడుకలు ఆస్ట్రేలియాలో ఘనంగా నిర్వహించారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ, అడిలైడ్, మెల్బోర్న్, కాన్బెర్రా, బ్రిస్బేన్, గోల్డ్ కోస్ట్, బెండీగో, బల్లారాట్ నగరాలలో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి అధ్వర్యంలో ప్రత్యేక ప్రత్యేక పూజలు చేశారు.అన్న దాన కార్యక్రమాలు చేపట్టారు. బీఆర్ఎస్ ఆస్ట్రేలియా నాయకుడు రాజేష్ గిరి రాపోలు, వినయ్ గౌడ్ సన్నీ ఆధ్వర్యంలో రక్త దాన కార్యక్రమం నిర్వహించారు.
బ్రిస్బేన్లో విన్నీ తుముకుంట ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో రవీందర్ చింతామణి, రాహుల్ రాంపల్లి, రవి శంకర్ దుపాటి, పరశురాం మూతుకుల్లా, సాయి గుప్తా, యుగేందర్ అల్లం, సంతోష్ రెడ్డి మాడు, శ్రీ వేకర్ రెడ్డి, శ్రీనివాస్ ఏలిజలా, నాగబెత్తుల, వాసు, సుబ్బు తదితరులు పాల్గొన్నారు.
