వేలేరు : తెలంగాణ రాష్ట్ర సాధకుడు, రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన మహానేత కేసీఆర్ అని వేలేరు మండల బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు మరిజె నర్సింహారావు అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలను మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పటాకులు కాల్చుతూ, కేక్ కట్ చేసి కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వృద్దులకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో విశిష్టమైన ప్రగతిని సాధించిందని తెలిపారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి రైతులకు సాగునీరు అందించారని, భీడు భూములను సైతం సాగు భూములుగా మార్చిన ఘనత ఒక్క కేసీఆర్ కే సాధ్యమైందని అన్నారు. కానీ రెండేళ్ల క్రితం ప్రభుత్వం లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను, రైతులను మోసం చేసిందని విమర్శించారు. వేలేరు మండలంలో గత ప్రభుత్వం లో చేసిన అభివృద్ధి పనులే తప్ప అధికార కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని విమర్శించారు.
వేలేరు మండల అభివృద్ధి కి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కృషి చేశారని, కాంగ్రెస్ పార్టీ నాయకుల నిర్లక్ష్యం కారణంగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలో వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల ఇంచార్జి ఇట్టబోయిన భూపతిరాజు, మాజీ వైస్ ఎంపీపీ సంపత్, మాజీ సర్పంచ్ కాయిత మాధవరెడ్డి, నాయకులు జానీ, కొయ్యడ మహేందర్, మారబోయిన రాజు, వెంకన్న, హరీఫ్, సుధాకర్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు