Julapalli | మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధికి విరాళం అందజేత
ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్ పిలుపునిచ్చారు.
జూలపల్లి, ఫిబ్రవరి 17 : ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో శ్రీ రావుల మల్లికార్జున స్వామి ఆలయంలో కేసీఆర్ పుట్టినరోజు పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్ మరెన్నో జన్మదిన వేడుకలు నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రఘువీర్ సింగ్ నేనున్నా స్వచ్ఛంద సేవా సమితి తరపున రూ. 50 వేల చెక్కును యాదవ సంఘం సభ్యులకు అందజేశారు.
ఈ క్రమంలో యాదవ కులస్తులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు తొగరు శ్రీనివాస్, మాజీ ఎంపీపీ వీసారపు వెంకటేశం, మాజీ వైస్ ఎంపీపీ మొగురం రమేష్, సర్పంచులు సూర ప్రభుదాస్, మెండె తిరుపతి, మాజీ ఎంపీటీసీ తమ్మడవేణి మల్లేశం, పార్టీ మాజీ మండల అధ్యక్షుడు కొండపల్లి కృష్ణమూర్తి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సంకెండ్ల లక్ష్మణ్, జిల్లా కురుమ సంఘం అధ్యక్షుడు పొట్టాల మల్లేశం, యాదవ సంఘం అధ్యక్షుడు ఆవుల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

