Bachhannapeta | పితృదేవతలను స్మరించుకోవడం గొప్పవరం : పులిగిల్ల పూర్ణచందర్
పితృ దేవతలను స్మరించుకోవడం ఎంతో గొప్ప వరమని పిఎసిఎస్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత పులిగిల్ల పూర్ణచందర్ అన్నారు.
బచ్చన్నపేట ఫిబ్రవరి 17 : పితృ దేవతలను స్మరించుకోవడం ఎంతో గొప్ప వరమని పిఎసిఎస్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత పులిగిల్ల పూర్ణచందర్ అన్నారు. మంగళవారం పులిగిల్ల రాజయ్య, లక్ష్మి, నరసయ్యల జ్ఞాపకార్థం జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని ఆర్యవైశ్య భవనంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్య వైశ్యులంత, వారి బంధువుల స్మారకార్థం అన్నదానాల కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటారన్నారు. పదిమంది పేదలకు ఈ రకంగా నైనా సేవ చేసే అవకాశం కలుగుతుందన్నారు.
జీవితంలో ఎంత సంపాదించమన్నది ముఖ్యం కాదని, ఎంతమంది పేదలకు సహాయం చేశామన్నదే ముఖ్యమని అన్నారు. అందుకే ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. అన్ని దానాల కన్నా అన్నదానం మహోన్నతమైనదని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పులివెందుల అంజయ్య, రామలింగం, పాండురంగం, వీరేశం, రాజేశం, కాశీపతి, దొంతుల రాజు, ప్రవీణ్, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

