లండన్ : ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్వర్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 72 వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. చారిత్రాత్మక లండన్ టవర్ బ్రిడ్జ్ వద్ద నుండి కేసీఆర్కు శుభాకాంక్షలు తెలుపడం సంతషంగా ఉందని ఎన్నారై బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని, తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కాపాడే క్రమంలో భగవంతుడు వారికి అన్ని సందర్భాల్లో మనోధైర్యాన్ని ,ఆశీస్సులు అందించి ముందుకు నడిపించాలన్నారు. రాబోయే రోజుల్లో మళ్లీ తెలంగాణకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తెలంగాణను మరింత అభివృద్ధి చెయ్యాలని ఆకాంక్షించారు.
ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ ఎలాగైతే ఉద్యమ సమయం నుండి నేటి వరకు వారి వెంట ఉన్నామో, భవిష్యత్తులో కూడా వారి వెంటే ఉంటామన్నారు. కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఉపాధ్యక్షుడు హరి గౌడ్ నవాబుపేట్, రవి రేటినేని, సత్య మూర్తి చిలుముల, ఎన్నారై బీఆర్ఎస్ యూకే కార్యదర్శి – ఐటీ, మీడియా & పీఆర్ రవి ప్రదీప్ పులుసు మాజీ అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి, ఈవెంట్స్ ఇంచార్జ్ తరుణ్ లూనావత్, అబ్దుల్ ఖుదూస్, ఇమ్రాన్, హరీష్ రెడ్డి, జనార్దన్, అస్లాం, సాయి కిరణ్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.