హైదరాబాద్, జూలై 23 (నమస్తేతెలంగాణ) : రూ.3వేల కోట్ల వ్యయంతో కాజీపేట- బల్హార్షా మధ్య 203 కి.మీమేర ట్రిప్లింగ్, విద్యుదీకరణ పనులు పూర్తి చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాత్సవ వెల్లడించారు.
గురువారం ఆయన మాట్లాడుతూ ఆసిఫాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య 11 కి.మీ మేర చేపట్టిన మూడో లైన్ నిర్మాణం, విద్యుదీకరణ పనులు బుధవారంతో పూర్తయినట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టు ప్రారంభం కావడంతో దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలను అనుసంధానించే గ్రాండ్ ట్రంక్ మార్గంలో సరుకు, ప్రయాణికుల రవాణా సజావుగా సాగుతుందని పేర్కొన్నారు.
హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ) : ప్రయాణికుల భద్రత, పారదర్శకమైన సేవలు అందించడానికి భారతీయ రైల్వే ఆధునిక సాంకేతికత పద్ధతు లు అమలు చేస్తున్నది. అందులో భాగంగా నార్త్ సెంట్రల్ రైల్వే టికెట్ తనిఖీ చేసే సిబ్బంది(టీసీలు)కి బాడీ కెమెరాలను అందించాలని నిర్ణయించింది. దీనివల్ల టికెట్ తనిఖీ ప్రక్రియలో జవాబుదారీత నం పెరుగుతుందని రైల్వేవర్గాలు పే ర్కొంటున్నాయి.
టీసీలకు బాడీ కెమెరాలను అమర్చేవిధానాన్ని ముందుగా ప్ర యాగ్రాజ్ – న్యూఢిల్లీ మధ్య తిరిగే రైళ్ల ల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని ఉ త్తర మధ్య రైల్వే నిర్ణయించింది. తర్వాత దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్టు రైల్వేశాఖ ప్రతినిధి శివమ్శర్మ పేర్కొన్నా రు. సుదీర్ఘ ప్రయాణాల్లో అంతరాయం కలుగకుండా దీర్ఘకాలిక బ్యాటరీ లైఫ్‌ను వీటికి అందించనున్నట్టు చెప్పారు.