Viral news | మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన పూజారి, ట్రాన్స్జండర్..!
Viral news | సమాజంలో నెలకొన్న మూస ధోరణులను, అపోహలను పటాపంచలు చేస్తూ ఓ జంట ఒక్కటైంది. ప్రేమకు లింగభేదాలు అడ్డురావని నిరూపిస్తూ ఓ ఆలయ అర్చకుడు (Temple Priest), ట్రాన్స్జెండర్ (Transgender) మహిళ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తమిళనాడు (Tamil Nadu) లోని కడలూరు జిల్లా (Cuddalore) లో జరిగిన ఈ ఆదర్శ వివాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Viral news : సమాజంలో నెలకొన్న మూస ధోరణులను, అపోహలను పటాపంచలు చేస్తూ ఓ జంట ఒక్కటైంది. ప్రేమకు లింగభేదాలు అడ్డురావని నిరూపిస్తూ ఓ ఆలయ అర్చకుడు (Temple Priest), ట్రాన్స్జెండర్ (Transgender) మహిళ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తమిళనాడు (Tamil Nadu) లోని కడలూరు జిల్లా (Cuddalore) లో జరిగిన ఈ ఆదర్శ వివాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. కడలూరుకు చెందిన ఆలయ అర్చకుడు నాగరాజన్, అదే ప్రాంతానికి చెందిన ట్రాన్స్జెండర్ మహిళ సంజనను సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు.
ఇరు కుటుంబాల పూర్తి అంగీకారంతో ఈ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. బంధుమిత్రులు, శ్రేయోభిలాషులతోపాటు పెద్ద సంఖ్యలో ట్రాన్స్జెండర్లు ఈ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను మనసారా ఆశీర్వదించారు. ఈ పెళ్లి వేడుక ఏమాత్రం సాధారణ వివాహానికి తీసిపోని విధంగా జరిగింది. మంగళవాయిద్యాలు, డప్పు చప్పుళ్ల హోరు మధ్య పెళ్లి ఊరేగింపు కోలాహలంగా సాగింది. ఈ సందర్భంగా కుటుంబసభ్యులు, స్నేహితులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఈ దృశ్యాలు చూస్తున్న వారికి ఇదొక సంబరంలా కనిపించింది.
ప్రస్తుతం ఈ వివాహానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. ఎన్నో అడ్డంకులను దాటుకుని ఒక్కటైన ఈ జంటపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వారి ధైర్యాన్ని మెచ్చుకుంటూ, ఇతరులకు ఆదర్శంగా నిలిచారని కామెంట్లు పెడుతున్నారు. సమాజంలో సానుకూల మార్పుకు ఈ వివాహం ఒక నిదర్శనంగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhaskar Rao | సింగరేణి లాభాల తగ్గుదలపై సమగ్ర నివేదిక విడుదల చేయాలి : మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు
పంచాయతీ అధికారి పర్సంటేజీల దందా ?
Weight Loss Surgery | కౌమారదశలో ఉన్న వారికి బరువు తగ్గించే శస్త్ర చికిత్సలు అవసరమా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది..?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

