ముంబై: జాయ్ రైడ్ సీటు సెఫ్టీ లాక్ ఊడిపోయింది. ఈ నేపథ్యంలో ఆ జాయ్ రైడ్‌పై ఉన్న మహిళ ఎత్తు నుంచి కిందపడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Woman Fall From Joyride) మహారాష్ట్రలోని అహల్యానగర్‌లో ఈ సంఘటన జరిగింది. జామ్ఖేడ్ ప్రాంతంలో నాగేశ్వర్ యాత్ర ఉత్సవం సందర్భంగా ‘ఆనంద్ మేళా’ జరుగుతున్నది. ఈ జాతరకు వెళ్లిన ఒక మహిళ ‘సునామీ’గా పిలిచే జాయ్ రైడ్ ఎక్కింది. అది వేగంగా ఊగుతుండగా ఆమె కూర్చొన్న సీటు సెఫ్టీ లాక్ ఊడిపోయింది. వేగంగా తిరుగుతున్న రైడ్ నుంచి ఆమె కిందపడింది. దీంతో ఆ జాతరలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
కాగా, గాయపడిన ఆ మహిళను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ సంఘటనపై స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరుగకుండా నివారించడానికి, రైడ్ ఆపరేటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, రైడ్ల భద్రతను తనిఖీ చేయాలని జామ్ఖేడ్ నివాసితులు డిమాండ్ చేశారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
झोका घेताना काळजाचा ठोका चुकला! जामखेडच्या आनंद मेळ्यात तरुणी पाळण्यातून कोसळली…
.
.
जामखेड येथे भरवण्यात आलेल्या आनंद मेळ्यात एक अत्यंत थरारक आणि काळजाचा ठोका चुकवणारी घटना घडली आहे. मेळ्यातील उंच पाळण्यात (झोका) बसलेली एक तरुणी अचानक नियंत्रण सुटल्याने थेट खाली कोसळली. हा… pic.twitter.com/28BSn3BIoN— Pune Prime News (@puneprime_news) August 23, 2026