న్యూఢిల్లీ, అక్టోబర్ 5 : బజాజ్ ఆటో..పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పండుగ సీజన్లో పల్సర్ బైకుపై రూ.12 వేల వరకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నట్టు తెలిపింది.
వీటిలో నగదు డిస్కౌంట్లు, జీరో ప్రాసెసింగ్ ఫీజుతోపాటు ఐదు ఉచిత సర్వీసింగ్ అవకాశాన్ని ఇస్తున్నట్టు కంపెనీ చీఫ్ బిజినెస్ అధికారి సరంగ్ కనదే తెలిపారు.