హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ) : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌నకు బొగ్గు కొరత సమస్యను అధిగమించేందుకు టీజీ జెన్కో చర్యలు చేపట్టింది. ఒడిశాలోని నైని కోల్‌బ్లాక్ నుంచి రోజుకు 16 వేల టన్ను ల బొగ్గును కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందుకు సంబంధించి టీజీ జెన్కో సీఎండీ ఎస్ హరీశ్ సోమవారం ఒడిశాలోని నైని కోల్‌బ్లాక్‌ను సందర్శించారు.
ఈ పర్యటనలో భాగంగా రైల్వే వ్యాగన్ల సంఖ్యను పెంచడం, స్థానిక రవాణా అడ్డంకులను అధిగమించడంపై సీఎండీ సింగరేణి అధికారులతో ప్రధానంగా చర్చించారు. నైనిలో లభిస్తున్న నాణ్యమైన బొగ్గు యాదాద్రి ప్లాంట్‌నకు అవసరమని, ఈ సరఫరాకు సింగరేణి అధికారులు సహకరించాలని కోరారు.