ఆండ్రీవాదే డబ్ల్యూటీఏ టైటిల్
విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ (డబ్ల్యూటీఏ) ఫైనల్స్‌లో రష్యా అమ్మాయి మిరా ఆండ్రీవా టైటిల్‌ను గెలుచుకుంది. సీజన్ ముగింపు టోర్నీ అయిన డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ ఆండ్రీవా.. 7-5, 6-3తో ఉక్రెయిన్ ప్లేయర్ ఎలీనా స్వితోలినాను చిత్తుచేసి చాంపియన్‌గా అవతరించింది.
- ఫైనల్లో స్వితోలినాపై విజయం
కాలిఫోర్నియా : విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ (డబ్ల్యూటీఏ) ఫైనల్స్‌లో రష్యా అమ్మాయి మిరా ఆండ్రీవా టైటిల్‌ను గెలుచుకుంది. సీజన్ ముగింపు టోర్నీ అయిన డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ ఆండ్రీవా.. 7-5, 6-3తో ఉక్రెయిన్ ప్లేయర్ ఎలీనా స్వితోలినాను చిత్తుచేసి చాంపియన్‌గా అవతరించింది. టోర్నీలో ఒక్క సెట్ కూడా ఓడిపోకుండా ఫైనల్స్ చేరిన ఆండ్రీవా.. టైటిల్ పోరులోనూ అదే ఆటతో అదరగొట్టింది.
ఈ టోర్నీలో ఇలా ఆడినవారిలో ఆమెది మార్టినా నవ్రతిలోవా, సెరెనా విలియమ్స్ వంటి దిగ్గజాల జాబితాలో 11వ స్థానం కావడం విశేషం. 19 ఏండ్ల ఆండ్రీవాకు కెరీర్లో ఇదే తొలి డబ్ల్యూటీఏ టైటిల్. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు స్వితోలినా, ఆండ్రీవా ‘నో షేక్‌హ్యాండ్’ విధానంతో పాటు ఫోటోలకూ ఫోజులివ్వలేదు. మహిళల డబుల్స్‌లో క్యాథరీనా సినికోవా-టేలర్ టౌన్సెండ్ (చెక్-అమెరికా జోడీ).. ఇటలీ ద్వయం సారా ఎరానీ-జాస్మిన్ పౌలినిని ఓడించి టైటిల్ సాధించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

