రైతాంగ ఐక్యతతోనే కేంద్ర విధానాలకు అడ్డుకట్ట
రైతాంగం, వ్యవసాయ కార్మికులు, భూమిలేని పేదలు, ఆదివాసీ సంఘాల ఐక్య పోరాటాలతోనే కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టగలమని రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ టికాయత్ పేర్కొన్నారు.
- ఢిల్లీ ఉద్యమస్ఫూర్తితో మరో పోరాటానికి సిద్ధం కావాలి
- రైతు సంఘాల సమిష్టి పోరాటాలతోనే వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు
- ఏఐకేఎస్ జాతీయ మహాసభల్లో రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ టికాయత్
రామగిరి, నవంబర్ 16 : రైతాంగం, వ్యవసాయ కార్మికులు, భూమిలేని పేదలు, ఆదివాసీ సంఘాల ఐక్య పోరాటాలతోనే కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టగలమని రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ టికాయత్ పేర్కొన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో 13 నెలలపాటు సాగిన రైతాంగ ఉద్యమం 3 వ్యవసాయ చట్టాల రద్దుకు కారణమైందని, 600 రైతు సంఘాలను సంయుక్త కిసాన్ మోర్చా వేదికపైకి తీసుకురావడం ఐక్య పోరాట శక్తికి నిదర్శమని చెప్పారు. నల్లగొండలోని సారంపల్లి మల్లారెడ్డినగర్‌లో సోమవారం నిర్వహించిన అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభల ప్రతినిధుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ నెల 26న దేశవ్యాప్తంగా రైతాంగ ఆందోళనలు, 27న చకాజామ్ నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షుడు అశోక్ ధావలే మాట్లాడుతూ.. ప్రజల్లో చైతన్యం పెంచే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అనంతరం సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య, ఏఐకేఎస్ సీనియర్ నాయకుడు ఎన్ శంకరయ్యలు రైతు నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి సేవలను స్మరించుకుంటూ సంతాపం తెలిపారు. రైతాంగ ఉద్యమానికి విశేష సేవలందించిన మదన్ ఘోష్, బయ్యారెడ్డి సేవలను కీర్తించారు. తొలి రోజు సదస్సులో ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజూకృష్ణన్, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నంద్యాల నర్సింహారెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

