మంత్రి సమావేశానికి కరెంట్ కట్
పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సోమవారం ములుగు జిల్లాలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో విద్యుత్తు సరఫరాకు అంతరా యం ఏర్పడింది. మంత్రి, కలెక్టర్ చేతుల మీదుగా ములుగు, వెంకటాపూర్ మండలాల లబ్ధిదారులకు నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ములుగులో నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.
- ఏఈపై క్రమశిక్షణా చర్యలకు కలెక్టర్ సిఫార్సు
- ములుగు జిల్లా కేంద్రంలో ఘటన
ములుగు, నవంబర్ 16 (నమస్తేతెలంగాణ): పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సోమవారం ములుగు జిల్లాలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో విద్యుత్తు సరఫరాకు అంతరా యం ఏర్పడింది. మంత్రి, కలెక్టర్ చేతుల మీదుగా ములుగు, వెంకటాపూర్ మండలాల లబ్ధిదారులకు నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ములుగులో నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.
కార్యక్రమం జరుగుతున్నంత సేపు నిరంతర విద్యుత్తు సరఫరా జరిగేలా ములుగు ఎంపీడీవో విద్యుత్తు శా ఖ అధికారులకు ముందస్తు ఆదేశాలు ఇచ్చినప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడంలో, ప్ర త్యామ్నాయ విద్యుత్తు సరఫరా చేయడం లో విద్యుత్తు శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ (ఆపరేషన్స్) బానోత్ రవి విఫలమయ్యారని పేర్కొంటూ కలెక్టర్ తీవ్రంగా స్పందించా రు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారిపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌కు సిఫార్సు లేఖ రాసినట్టు కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

