హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ) : డిసెంబర్ 7 నుంచి 9 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఉన్నతాధికారులతో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ కంపెనీల నుంచి సమ్మిట్‌కు విస్తృత భాగస్వామ్యం ఉండేలా చర్యలు తీసుకోవడంతోపాటు సమ్మిట్ అడ్వైజరీ బోర్డు లేదా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలని ఆదేశించారు.
ఈ నెలలో ఢిల్లీ, విదేశాల్లో గ్లోబల్ సమ్మిట్‌పై రోడ్డు షోలు నిర్వహించి రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలను కార్పొరేటు సంస్థలకు వివరించాలన్నారు.