Raksha Bandhan Horoscope | ఏ రాశికి ఆ రాఖీ.. మీ అన్నదమ్ములకు ఏ రంగు రాఖీ కడితే మంచిదో తెలుసా!
జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ప్రతి రంగూ ఒక ప్రత్యేక శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి, సోదరుడి రాశి స్వభావానికి సరిపడే రంగు రాఖీని ఎంచుకోవడం వల్ల సానుకూల ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
తోబుట్టువుల మధ్య అనురాగం, రక్షణ, పరస్పర గౌరవానికి ప్రతీక.. రక్షాబంధన్! ఈ పండుగ రోజున సోదరుడి చేతికి కట్టే రాఖీ.. కేవలం ఒక దారం మాత్రమే కాదు. అతని ఆయురారోగ్యాలు, ఉన్నతిని కాంక్షిస్తూ సోదరి అందించే దివ్యమైన ఆశీస్సు కూడా. అందుకే, రాఖీల ఎంపికలో డిజైన్, ఆకర్షణతోపాటు విశేష ప్రాముఖ్యత కలిగిన రంగులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఎందుకంటే, జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ప్రతి రంగూ ఒక ప్రత్యేక శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి, సోదరుడి రాశి స్వభావానికి సరిపడే రంగు రాఖీని ఎంచుకోవడం వల్ల సానుకూల ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
మేషం
వీరికి ఎరుపు రంగు రాఖీ అత్యంత అనుకూలం. ఇది వారిలోని ధైర్యాన్ని, చురుకుదనాన్ని మరింత పెంచుతుంది.
వృషభం
ఆకుపచ్చ లేదా లేత నీలం రాఖీలు ఈ రాశివారికి శ్రేయస్కరం. ఇవి వారికి మానసిక స్థిరత్వాన్ని, సుఖశాంతులను చేకూరుస్తాయి.
మిథునం
వీరికి పసుపు లేదా లేత ఆకుపచ్చ రాఖీ సరిపోతుంది. ఇది వారి జిజ్ఞాసను, సంభాషణా నైపుణ్యాన్ని మెరుగుపరుస్తుంది.
కర్కాటకం
ఈ రాశి వారికి తెలుపు లేదా వెండి రంగు రాఖీ శ్రేష్టం. ఇది వారికి భావోద్వేగ స్థిరత్వాన్ని, ప్రశాంతతను అందిస్తుంది.
సింహం
నారింజ, బంగారు లేదా రాయల్ రెడ్ రంగు రాఖీలు.. సింహరాశి వారికి అనువైనవి. ఇవి వారి నాయకత్వ లక్షణాలను, ఆత్మవిశ్వాసాన్ని మరింత ప్రకాశింపజేస్తాయి.
కన్య
ఈ రాశి వారికి లేత ఆకుపచ్చ లేదా లేత గోధుమ రంగు రాఖీలు కట్టడం మంచిది. ఇది వారి ఏకాగ్రతను, కార్యాచరణను పెంచుతుంది.
తుల
లేత నీలం లేదా గులాబీ రంగు రాఖీలు వీరికి సరిపోతాయి. వారిలో సామరస్యాన్ని, ప్రేమపూర్వక సంబంధాలను బలపరుస్తాయి.
వృశ్చికం
వీరికి ముదురు ఎరుపు, మెరూన్ లేదా ముదురు గోధుమరంగు రాఖీలు అనుకూలంగా ఉంటాయి. వారి సంకల్ప బలాన్ని కాపాడతాయి.
ధనుస్సు
పసుపు, కాషాయం లేదా పర్పుల్ (ఊదా) రాఖీలు అత్యుత్తమం. ఇవి వారిలోని ఆశావాదాన్ని, జ్ఞానాన్ని విస్తరింపజేస్తాయి.
మకరం
నేవీ బ్లూ, బూడిద (గ్రే) లేదా ముదురు ఆకుపచ్చ రాఖీలు శ్రేయస్కరం. ఇవి క్రమశిక్షణను, వృత్తిపరమైన పురోగతిని ప్రోత్సహిస్తాయి.
కుంభం
స్కై బ్లూ లేదా వయోలెట్ రంగు రాఖీలు వీరికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి సృజనాత్మకతను, స్నేహభావాన్ని పెంపొందిస్తాయి.
మీనం
ఈ రాశి వారికి లేత పసుపు, సీ-గ్రీన్ లేదా లావెండర్ రాఖీలు అనువైనవి. ఇవి భావోద్వేగ సమతుల్యతను, మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Retired Engineer | ఏపీ పల్నాడు వాటర్ గ్రిడ్ నిర్మిస్తుంటే తెలంగాణకు తెల్వక పోవడం ఆశ్చర్యకరం : రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం ఆందోళన
Brothers Kill Wives | భార్యల మధ్య గొడవలు భరించలేక.. వారిని హత్య చేసిన సోదరులు
Mens Health | పురుషులు చక్కని శరీరాకృతి కావాలంటే ఈ సూచనలు పాటించాలి.. ఇవన్నీ కీలకమే..
Ramgopal Varma | ఏఐ ఉద్యోగాలను లాగేసుకుంటుందా.. ఆర్జీవీ సంచలన పోస్టు..!
‘రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

