Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు 10 గ్రాండ్ లాంచ్ డేట్ ఫిక్స్.. నాగార్జునతో ఆటే అసలు సవాల్!
Bigg Boss 10 | తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10కు రంగం సిద్ధమైంది. ఈసారి మరింత కొత్తదనం, ఉత్కంఠభరితమైన టాస్కులు, ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులను అలరించేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు.
Bigg Boss 10 | తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10కు రంగం సిద్ధమైంది. ఈసారి మరింత కొత్తదనం, ఉత్కంఠభరితమైన టాస్కులు, ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులను అలరించేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ సీజన్ గ్రాండ్ లాంచ్ తేదీపై అధికారిక ప్రకటన రావడంతో అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 సెప్టెంబర్ 6న సాయంత్రం 7 గంటలకు గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఈ షో స్టార్ మా ఛానెల్‌తో పాటు జియో హాట్‌స్టార్‌లో కూడా ప్రసారం కానుంది. గత సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.
ఇటీవల విడుదలైన ప్రోమోలో నాగార్జున చెప్పిన “ఆటలో కాదు.. ఆటే సవాల్” అనే డైలాగ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచింది. ఈసారి బిగ్ బాస్ హౌస్‌లో గతంలో ఎన్నడూ చూడని విధంగా సవాళ్లు, డ్రామా, సర్ప్రైజ్లు, ట్విస్టులు ఉండబోతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. కంటెస్టెంట్లకు గేమ్ మరింత కఠినంగా ఉండబోతుందని ప్రోమో ద్వారానే మేకర్స్ చెప్పకనే చెప్పారు. ఈ సీజన్లో సామాన్యులకు కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తున్నారు. అందులో భాగంగా ‘అగ్నిపరీక్ష సీజన్ 2’ కొనసాగుతోంది. ఇందులో పాల్గొంటున్న కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్‌లో చోటు కోసం పోటాపోటీగా టాస్కులు చేస్తున్నారు.
గేమ్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన కొందరు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుండగా, మరికొందరు ఎల్లో కార్డులు అందుకుని డేంజర్ జోన్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మొత్తం 15 మంది పోటీదారుల నుంచి ఉత్తమంగా నిలిచిన నలుగురు లేదా ఐదుగురికి ప్రధాన బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఈసారి బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టబోయే సెలబ్రిటీలు ఎవరనే దానిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. ముఖేష్ గౌడ, పల్లవి గౌడ, తేజస్విని గౌడ, కావ్యశ్రీ, జబర్దస్త్ రాంప్రసాద్, పొట్టి నరేష్, నూకరాజు, రాకింగ్ రాకేష్, ఆట సందీప్ భార్య జ్యోతి, యూట్యూబర్ నందు, కడలి సత్యనారాయణ, యాంకర్ వర్షిణి, నటుడు కృష్ణుడు, టెంపర్ వంశీ, ఫోక్ డ్యాన్సర్ మాథురీ రాథోడ్, బెంగాలీ నటి దేబ్జానీ మోదక్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీరిలో ఎవరు నిజంగా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెడతారనే విషయంపై ఇప్పటివరకు అధికారిక స్పష్టత రాలేదు. గ్రాండ్ లాంచ్ రోజునే పూర్తి కంటెస్టెంట్ల జాబితాపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

