RS Praveen kumar | బీఆర్ఎస్ 3.0 డిఫరెంట్‌గా ఉండబోతుంది.. వారందరిపై చట్టపరమైన చర్యలు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar | ఎవరెవరైతే అక్రమంగా తప్పులు చేశారో, అక్రమ కేసులు పెట్టారో, ప్రజలను వేధించారో రేవంత్ రెడ్డి అక్రమ ఆదేశాలనుసారం ఘోరంగా హింసించారో వాళ్లందరి మీద కూడా చట్టపరంగాచర్యలుంటాయని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.
RS Praveen Kumar | బీఆర్ఎస్ 3.0 ఖచ్చితంగా డిఫరెంట్‌గా ఉండబోతుంది.. నేను చాలెంజ్ చేస్తున్నా.. వాగ్ధానం చేస్తున్నా. దయాదాక్షిణ్యాలుండవని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మంచి చేసినోళ్లను.. చట్టప్రకారం పోయినోళ్లను గుండెల్లో పెట్టి కాపాడుకుంటది.. కానీ కేసీఆర్ నాయకత్వంలో రాబోయే రోజుల్లో వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరెవరైతే అక్రమంగా తప్పులు చేశారో, అక్రమ కేసులు పెట్టారో, ప్రజలను వేధించారో రేవంత్ రెడ్డి అక్రమ ఆదేశాలనుసారం ఘోరంగా హింసించారో వాళ్లందరి మీద కూడా చట్టపరంగా చర్యలుంటాయని హెచ్చరించారు.
గట్టిగా అడిగిన బీఆర్ఎస్ నేతల గన్మెన్లందరినీ కూడా తీసేశారు. మేం ఈ రోజు కూడా అడుగుతున్నం. గన్మెన్లను ఏ బేసిస్ మీద తీసేశారు. ఏ బేసిస్ మీద జానారెడ్డికి అత్యుత్తమమైన బుల్లెట్ ప్రూప్ కారు ఇచ్చారు. ఆయనేమైనా ముఖ్యమంత్రా..? లేదా ఇంకేమైనా రాజ్యాంగబద్దమైన పొజిషన్ ఉందా.. ఏం లేదు.. ఆయనకు బుల్లెట్ ప్రూప్ కారు ఎట్లా వచ్చిందని ప్రశ్నించారు. ఏ బేసిస్ మీద రేవంత్ రెడ్డి సోదరులు తిరుపతి రెడ్డికి, కొండల్ రెడ్డికి 2+2 గన్మెన్లు ఇచ్చారు.. ? మా జోగు రామన్నతోపాటు మిగితా సీనియర్ నాయలకుందరికీ కూడా ఎందుకు ఇవ్వడం లేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.
అయ్యా దయచేసి మాకు న్యాయం చేయండి.. అని డీజీపీకి 15రోజుల క్రితం వాళ్లు లేఖ రాశారు. ఏమీ అర్హత లేని వాళ్లకు ఇచ్చారు. కొంతమందైతే 80 సంవత్సరాల ముసలోళ్లకు కూడా గన్మెన్లను ఇచ్చారు. ఆ 80 సంవత్సరాల ముసలోళ్లను ఈ రాష్ట్రమే మరిచిపోయింది. వాళ్లకు కూడా గన్మెన్లను తీసేశారు.. ఏమన్నా అంటే రేవంత్ రెడ్డి దగ్గర.. ఏ బేసిస్ మీద గన్మెన్లను తీసేసిండ్రని అడిగితే లేకపోతే మీ మీద తప్పుడు కేసు పెడతామని బెదిరిస్తారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ 3.0లో దయాదాక్షిణ్యాలు ఉండవు
కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి అక్రమ ఆదేశాల మేరకు ప్రజలను వేధించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాము
– ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ pic.twitter.com/TJAmCK4Puu
— Telugu Scribe (@TeluguScribe) August 29, 2026
రేవంత్ రెడ్డి సోదరులు తిరుపతి రెడ్డికి, కొండల్ రెడ్డికి 2+2 గన్మెన్లు ఏ బేసిస్ మీద ఇచ్చారు?
బీఆర్ఎస్ నేతలకు గన్మెన్లను తొలగించి, జానారెడ్డికి అత్యాధునిక బుల్లెట్‌ప్రూఫ్ కారు ఇచ్చారు
జానారెడ్డి ఏమైనా ముఖ్యమంత్రా? రాజ్యాంగపరమైన స్థానంలో ఉన్నాడా?
బండి సంజయ్ కొడుకును దాచి… https://t.co/sXmvI1levD pic.twitter.com/pqT9QTy7tH
— Telugu Scribe (@TeluguScribe) August 29, 2026
Read Also :
సెప్టెంబర్ 1న ఉమ్మడి నల్లగొండ జిల్లా జూనియర్ బాలికల ఫుట్‌బాల్ జట్టు ఎంపికలు
Suryapet News | వేపచెట్టు వివాదం.. రెండు నిండు ప్రాణాలు బలి.. ఎస్ఐకి గాయాలు!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

