నల్లగొండ, ఆగస్టు 29 : సెప్టెంబర్ 4వ తేదీ నుండి 7వ తేదీ వరకు నిజామాబాద్ పట్టణంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జూనియర్ బాలికల రాష్ట్రస్థాయి ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి నల్లగొండ జిల్లా జట్టు ఎంపికలను 01/09/2026 మంగళవారం నల్లగొండ పట్టణంలోని చర్లపల్లి విపస్య హైస్కూల్ నందు నిర్వహించనున్నట్లు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బండారు ప్రసాద్, బొమ్మపాల గిరిబాబు తెలిపారు. 01.01.2011–31.12.2012 మధ్యన జన్మించిన ఆసక్తి కలిగిన క్రీడాకారిణులు ఆధార్ కార్డు, 2 పాస్పోర్టు సైజ్ ఫొటోలతో ఉదయం 10 గంటలకు హాజరు కావాలన్నారు. పూర్తి వివరాలకు 8247045667, 9440374027 నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.