IPL 2026 : సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad స్క్వాడ్‌లోకి కొత్త పేసర్ వచ్చాడు. గాయంతో టోర్నీకి దూరమైన డేవిడ్ పైన్ స్థానంలో గెరాల్డ్ కొయెట్జీ(Gerald Coetzee)ని సన్‌రైజర్స్ తీసుకుంది.
GT vs KKR : పంతొమ్మిదో సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆడిన ప్రతి మ్యాచ్ ఓడిపోతూనే ఉంది. ఇప్పటికే నాలుగింటా కంగుతిన్న కోల్‌కతాను ఉత్కంఠ పోరులో గుజరాత్ టైటాన్స్ మట్టికరిపించింది.
GT vs KKR : ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన కామెరూన్ గ్రీన్(79) ఎట్టకేలకు చెలరేగాడు. అహ్మదాబాద్‌లో ఆదిలోనే కష్టాల్లో పడిన కోల్‌కతా నైట్ రైడర్స్‌ను అర్ధ శతకంతో ఆదుకున్నాడు.
GT vs KKR : గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) జట్టుతో కోల్‌కతా తలపడుతోంది. నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన అజింక్యా రహానే బ్యాటింగ్ తీసుకున్నాడు.
Gujarat Titans : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్లో గాయాల బారిన ఆటగాళ్ల స్థానంలో కొత్తవాళ్లు అవకాశాలు దక్కించుకుంటున్నారు. గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) సైతం కొత్త కుర్రాడిని తీసుకుంది.
IPL Tickets : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) మ్యాచ్ టికెట్లను ఓ వ్యక్తి బ్లాక్‌లో అమ్ముకున్నాడు. చిన్నస్వామి స్టేడియం క్యాంటీన్లో పనిచేస్తున్న అతడు.. వంద టికెట్లను బ్లాక్‌లో భారీ ధరకు అమ్ముతూ పోలీసులకు చిక్కాడు.
Mumbai Indians : సొంత మైదానమైన వాంఖడేలోనూ ముంబై పాచిక పారలేదు. లీగ్ దశలో తడబాటులో ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న వేళ కెప్టెన్సీ మార్పు అనివార్యమని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ (Manoj Tiwary) అంటున్నాడు.
సన్‌రైజర్స్ అభిమానులకు శుభవార్త! వెన్నునొప్పికి శస్త్రచికిత్స, అనంతర పరిణామాలతో గత జులై నుంచి ఆటకు దూరమైన ఆస్ట్రేలియా సారథి పాట్ కమిన్స్ ఐపీఎల్‌లోకి పునరాగమనం చేయనున్నాడు.
MI vs PBKS : పంతొమ్మిదో సీజన్లో పంజాబ్ కింగ్స్(Punjab Kings)కు ఎదురన్నదే లేకుండా పోయింది. హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న ఆ జట్టు వాంఖడేలో ముంబై ఇండియన్స్‌ను చిత్తుగా ఓడించింది.
MI vs PBKS : వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్(112 నాటౌట్) అజేయ సెంచరీతో గర్జించాడు. ఆదిలోనే రెండు వికెట్లు పడినా ఒత్తిడికి లోనవ్వని డికాక్.. నమన్ ధిర్(50)తో కలిసి శతక భాగస్వామ్యం నెలకొల్పాడు.
MI vs PBKS : లీగ్ దశలో అజేయంగా దూసుకెళ్తున్న పంజాబ్ కింగ్స్‌ను ముంబై ఇండియన్స్ ఢీ కొడుతోంది. తొలుత బ్యాటింగ్ చేయనున్న ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ స్థానంలో క్వింటన్ డికాక్‌ను తీసుకుంది.
Chennai Super Kings : ఆర్సీబీ సొంత మైదానంలో తమకు జరిగిన అవమానంపై చెన్నై ఫ్రాంచైజీ భగ్గుమంటోంది. చిన్నస్వామి స్టేడియంలో 'ఇడ్లీ, దోసె, సాంబార్' పాటతో తమను అవమానించారని భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI)కి సీఎస్కే ఫిర్యాదు �