ACB Rides | టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ సోదాలు
ACB Rides | టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఆంధ్రప్రదేశ్ ఏసీబీ అధికారులు దాడులు చేశారు. బ్యాంక్ లాకర్లు, పలు ప్రాంతాల్లో ఉన్న బంధువుల ఇళ్లలో సోదాలు చేశారు. పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
ACB Rides | తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) డిప్యూటీ ఈవోగా లోకనాథం పనిచేస్తున్నారు. ఆయనపై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ ఏసీబీ అధికారులు 7 బృందాలుగా ఏర్పడి బుధవారం ఉదయాన్నే దాడులు నిర్వహించారు. తిరుపతిలోని పెద్దకాపు లేఅవుట్లోని ఆయన ఇంట్లో సోదాలు చేశారు. ఈ దాడుల సమయంలో ఆయన ఇంట్లొనే ఉన్నారు.
తిరుమలలోని లోకనాథం కార్యాలయంతో సహా 7 చోట్ల ఏకకాలంలో సోదాలు చేశారు. శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవోగా విధులు నిర్వహిస్థున్న లోకనాథం టీటీడీ పలు ఆలయాల్లో డిప్యూటీ ఈవోగా పనిచేశారు. కోట్ల ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో అధికారులు 7 బృందాలుగా ఏర్పడి ఉదయం 6 గంటల నుంచే అతడి ఇంటితో సహా ఆయన బంధువుల ఇళ్లపై దాడులు నిర్వహించారు.

Acb
ఏర్పేడు మండలంలోని చెల్లూరు ఉంటున్న లోకనాథం సోదరుడు ఇంటితో పాటు ఆయన ఇద్దరు బావమరుదుల ఇళ్లలో సోదాలు చేశారు. తిరుపతి ఎస్టీవీ నగర్లో ఉన్న SBI బ్యాంక్‌లోని లాకర్లను తనిఖీ చేశారు. ఈ దాడుల్లో పలు పత్రాలు, నగదు, బంగారం, వెండి లభించాయని, ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు సమాచారం.
గతంలో 2011లో కూడా టీటీడీ డిప్యూటీ ఈవో భూపతి రెడ్డిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. 15 ఏండ్ల తరువాత టీటీడీ ఉద్యోగిపై ఏసీబీ దాడులు నిర్వహించడం ఇదే తొలిసారి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

