Suraj Venjaramoodu | ‘జైలర్ 2’ నుంచి అదిరిపోయే అప్డేట్.. విలన్‌గా మలయాళ స్టార్ ఎంట్రీ!
Jailer 2 | సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ 'జైలర్ 2' నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
Jailer 2 | సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా ప్రమోషన్స్‌ను అధికారికంగా ప్రారంభించిన చిత్ర బృందం, చిత్రంలోని కీలక నటీనటుల పాత్రలను పరిచయం చేసే రోల్అవుట్ను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా విడుదలైన మొదటి క్యారెక్టర్ ప్రోమోలో మలయాళ స్టార్ నటుడు సూరజ్ వెంజరమూడు పాత్రను మేకర్స్ రివీల్ చేశారు. ఈ చిత్రంలో సూరజ్ వెంజరమూడు ‘దిలీప్’ అనే అత్యంత పవర్ఫుల్ మరియు ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. విడుదల చేసిన 35 సెకన్ల క్యారెక్టర్ ప్రోమోలో ఆయన కారు దిగి సిగార్ కాలుస్తూ చాలా స్టైలిష్‌గా, భయంకరమైన లుక్‌లో అందరినీ ఆకట్టుకున్నారు. అనిరుధ్ రవిచందర్ అందించిన కేరళ డ్రమ్స్ మిక్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ పాత్ర ఎంట్రీకి భారీ హైప్‌ను తీసుకువచ్చింది.
ఈ ప్రోమోలో ఆయన పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను సస్పెన్స్‌గా ఉంచినప్పటికీ, ఆయన లుక్ మరియు మేనరిజమ్స్ చూస్తుంటే ముత్తువేల్ పాండియన్ పాత్రను ఢీకొట్టే ప్రధాన విలన్‌గా లేదా ఒక బలమైన యాంటీ హీరోగా కనిపించబోతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మొదటి భాగంలో వినాయకన్ పోషించిన వర్మన్ పాత్ర ఎంతలా సంచలనం సృష్టించిందో, ఈ సీక్వెల్లో సూరజ్ పాత్ర అంతకంటే పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో రమ్యకృష్ణన్, యోగిబాబు, మీర్నాలు తమ మొదటి భాగంలోని పాత్రలను కొనసాగిస్తుండగా, వీరితో పాటు మిథున్ చక్రవర్తి, ఎస్.జె. సూర్య, విద్యాబాలన్ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో భాగం కానున్నారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. అన్ని అంచనాలను తలకిందులు చేస్తూ ‘జైలర్ 2’ చిత్రం 2026 అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

