తీరం వైపు దూసుకొస్తున్న ‘అక్వాన్’
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అక్వాన్' తుపాను క్రమంగా బలపడుతూ తీరం వైపు దూసుకొస్తున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైందని తెలిపారు.
- మూడు రోజులపాటు భారీ వర్షాలు
హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అక్వాన్’ తుపాను క్రమంగా బలపడుతూ తీరం వైపు దూసుకొస్తున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైందని తెలిపారు. గత ఆరు గంటలుగా గంటకు 3 కి.మీ వేగంతో చాలా నెమ్మదిగా కదులుతున్నదని, రాబోయే 12 గంటల్లో మరింత బలపడి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్టు తెలిపింది.
నవంబర్ 19న ఉదయానికి అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందే సూచనలు ఉన్నట్టు పేర్కొన్నారు. ఉత్తర వాయవ్య దిశగా కదులుతున్న ఈ తుపాను ఈ నెల 20న ఏపీ తీరాన్ని దాటే సమయంలో గంటకు 120 నుంచి 145 కి.మీ వేగంతో ప్రచండ గాలులు వీచే అవకాశం ఉందని, దీని ప్రభావంతో నవంబర్ 20 నుంచి 22 వరకు తెలంగాణవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

