పైసల్లేనిదే పనైతలేదు.. ఇది లంచగొండుల సర్కార్!
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సాగుతున్న అవినీతి బాగోతాన్ని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే బట్టబయలు చేశారు. తమ ప్రభుత్వంలో లంచగొండి అధికారులు రాజ్యమేలుతున్నారని కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
- 10 నుంచి 20 శాతం లంచాలు అడుగుతున్నరు
- సొంత ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపణ
- ఇది స్వీయానుభవమని వెల్లడించిన అనిరుధ్‌రెడ్డి
- జాతీయ మీడియాలో ఎమ్మెల్యే వ్యాఖ్యలు వైరల్
జడ్చర్ల, నవంబర్ 17 : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సాగుతున్న అవినీతి బాగోతాన్ని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే బట్టబయలు చేశారు. తమ ప్రభుత్వంలో లంచగొండి అధికారులు రాజ్యమేలుతున్నారని కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పైసలివ్వకుంటే ఆ అధికారులు పనులు చేయడం లేదని వ్యాఖ్యానించారు. కాంట్రాక్టర్ల బిల్లుకు ఎంబీ చేయాలంటే 10 నుంచి 20 శాతం లంచాలు డిమాండ్ చేస్తున్నారని వెల్లడించారు. సొంత ప్రభుత్వంపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు జాతీయ మీడియాలో వైరల్ అయ్యాయి. జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్వహించిన జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనంలో అనిరుధ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ నాయకుల కంటే ప్రభుత్వ అధికారులే అవినీతిపరులని చెప్పారు. ‘నేను ఒక వ్యక్తికి చెందిన విరాసత్ చేయాలని అడిగితే ఓ అధికారి చేయలేదు.
కానీ ఆ వ్యక్తి రూ.15 వేలు ఇవ్వగానే పనిచేశారు. అధికారులు లంచం తీసుకోవడం వల్లే మా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తున్నది. ఇలాంటివి జర్నలిస్టులు బయటపెడితే వారిని శిక్షించే పని నాది. నేను నిజాయితీగా ఉండాలనుకుంటున్నా.. కానీ కిందివారు నిజాయితీగా లేకుంటే ఎలా పనులు చేయాలి? అలాంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిందే’నని పేర్కొన్నారు. సిమెంట్ రోడ్డు రూ.5 లక్షల బిల్లుకు ఎంబీ చేయాలంటే అధికారులు 10 నుంచి 20 శాతం లంచాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. దాంతో కాంట్రాక్టర్లు పనులు చేయకుండా పారిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇద్దరు, ముగ్గురు రైటర్లు కూర్చొని రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని విమర్శించారు. జర్నలిస్టులు నిజాలను నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకురావాలని, వృత్తి నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

