పంటలు వెయ్యొద్దు.. ఫంక్షన్లు చెయ్యొద్దు
‘పంటలు సాగు చేయొద్దు.. ఫంక్షన్లు చేసుకోవద్దు’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు, రైతులకు హుకుం జారీ చేశారు. జూపల్లి వరుసగా రెండ్రోజుల పాటు చేసిన వ్యాఖ్యలను ప్రజలు తప్పుబడుతున్నారు.
- కాలువల నుంచి చుక్క నీరూ ఇవ్వం
- కరెంట్ కూడా వచ్చే పరిస్థితి లేదు
- బావుల కిందా ఆరుతడి పంటలే వేయాలి
- ఆడపిల్లల శారీ ఫంక్షన్లు జరుపుకోవద్దు
- 2 రోజులుగా మంత్రి జూపల్లి ప్రవచనాలు
కొల్లాపూర్, నవంబర్ 17 : ‘పంటలు సాగు చేయొద్దు.. ఫంక్షన్లు చేసుకోవద్దు’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు, రైతులకు హుకుం జారీ చేశారు. జూపల్లి వరుసగా రెండ్రోజుల పాటు చేసిన వ్యాఖ్యలను ప్రజలు తప్పుబడుతున్నారు. సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లోని రాజాగారి బంగ్లా ఎదుట నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ కల్వకుర్తి, భీమా, జూరాల కాలువల కింద రెండో పంట సాగు చేయొద్దని రైతులకు సూచించారు. కాలువలకు చుక్క నీరు కూడా ఇచ్చేది లేదని స్పష్టంచేశారు. బావుల కింద సాగు చేసుకునే రైతులు సైతం ఆరుతడి పంటలకే పరిమితం కావాలని ఆదేశించారు. కరెంట్ కూడా వచ్చేది లేదని తెగేసి చెప్పారు. మంత్రి వ్యాఖ్యలతో సభలో ఉన్న రైతులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇదిలావుండగా మంగళవారం చిన్నంబావి మండల కేంద్రంలో చేయూత పింఛన్ల కార్యక్రమంలో ఆడపిల్లల ఫంక్షన్లు చేసుకోవద్దని ప్రజలకు సూచించడం మరోసారి చర్చకు తెరలేపింది. ప్రజల నిర్వహించుకునే శుభకార్యాలపై ఆంక్షల తరహాలో మంత్రి జూపల్లి సూచనలు చేయడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఆడపిల్లల శారీ ఫంక్షన్లు చేయొద్దంటూ మంత్రి పేర్కొన్నడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.
జూపల్లి వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే ఫైర్
కృష్ణానదిలో నీళ్లున్నా పంటలకు సాగునీరందించడం చేతకాని మంత్రి జూపల్లి కృష్ణారావు రైతులను పంటలు వేసుకోవద్దని చెప్పడం సిగ్గుచేటని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. రైతుల ఆర్థిక స్థితిని దెబ్బతీస్తూ మరో పక్క ఆడపిల్లల ఫంక్షన్లు చేసుకోవద్దని చెప్పడాన్ని తప్పుబట్టారు. నది నీటిని ఎత్తిపోసి ఉంటే రిజర్వాయర్లలో 50 టీఎంసీల వరకు నిల్వ ఉండే అవకాశం ఉండేదని, రైతుల పంటలు పండి ఆర్థికంగా అన్ని వర్గాల వారు సుభిక్షంగా ఉండేవారి పేర్కొన్నారు. కొల్లాపూర్ ప్రజలు బాగుపడటం జూపల్లికి ఇష్టం లేదని ధ్వజమెత్తారు. అందుకే పంటలు వేసుకోవద్దు, ఫంక్షన్లు చేసుకోవద్దని అంటున్నారని దుయ్యబట్టారు. జూపల్లి కుటుంబంలో ఫంక్షన్ జరుపుకోకుండా ఉంటారా? అని ప్రశ్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

