MI vs PBKS : పంతొమ్మిదో సీజన్లో పంజాబ్ కింగ్స్(Punjab Kings)కు ఎదురన్నదే లేకుండా పోయింది. హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న ఆ జట్టు వాంఖడేలో ముంబై ఇండియన్స్‌ను చిత్తుగా ఓడించింది. భారీ ఛేదనలో ముంబై బౌలర్లను ప్రభ్‌సిమ్రన్ సింగ్(80 నాటౌట్), శ్రేయాస్ అయ్యర్(66)లు ఎడాపెడా ఉతికేశారు. రెండు వికెట్లు పడినా ఆతిథ్య జట్టుకు ఒత్తిడి పెంచే అవకాశమివ్వలేదు ఇద్దరు. విజయానికి 12 పరుగులు అవసరమైన వేళ అయ్యర్ ఔటైనా ప్రభ్‌సిమ్రన్ లాంఛనం పూర్తి చేశాడు.
నిరుడు రన్నరప్ పంజాబ్ కింగ్స్ ఈసారి అజేయంగా దూసుకుపోతోంది. ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తు చేస్తున్న శ్రేయాస్ అయ్యర్ సేన వాంఖడేలో ముంబై ఇండియన్స్(MI)ను మట్టికరిపించింది. ఓపెనర్ క్వింటన్ డికాక్() సూపర్ సెంచరీతో భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. పంజాబ్ బ్యాటర్లు కంగారుపడలేదు. గజన్ఫర్ విజృంభణకు పవర్ ప్లేలో ప్రియన్ష్ ఆర్య(17), కూపర్ కొన్నొల్లీ(15)లు ఔటైనా.. ముంబై నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు శ్రేయాస్ అయ్యర్(66), ప్రభ్‌సిమ్రన్ సింగ్(80 నాటౌట్)లు.
FINE CATCH!! 👏
🎥 Naman Dhir with a brilliant diving catch in the deep 🫴
Updates ▶️ https://t.co/Fn2dxJ429j#TATAIPL | #KhelBindaas | #MIvPBKS | @mipaltan pic.twitter.com/4LXPj5cmC6
— IndianPremierLeague (@IPL) April 16, 2026
అగ్నికి వాయువు తోడైనట్టు ఇద్దరూ కసికొద్ది బౌండరీలు బాదడంతో కొండంత లక్ష్యం కరుగుతూ పోయింది. బుమ్రా, హార్దిక్ ఓవర్లలో రెచ్చిపోయిన అయ్యర్, ప్రభ్‌సిమ్రన్‌లు అర్ధ శతకాలతో పంజాబ్‌ను గెలుపు దిశగా నడిపారు. శార్దూల్ ఠాకూర్ ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన అయ్యర్‌ను నమన్ ధిర్ డైవింగ్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. అప్పటికీ పంజాబ్ విజయానికి 12 పరగులు కావాలంతే. స్టోయినిస్(10)తో కలిసి ప్రభ్‌సిమ్రన్ 7 వికెట్ల విజయాన్ని కట్టబెట్టగా.. సొంత మైదానంలోనైనా విజయంతో మురవాలనుకున్న ముంబై ఆశలు అడియాశలయ్యాయి.
STANDING UP AGAIN!! 👏
A 23-ball 5️⃣0️⃣ from Prabhsimran Singh to keep #PBKS in the hunt 🫡
Updates ▶️ https://t.co/Fn2dxJ4zYR#TATAIPL | #KhelBindaas | #MIvPBKS pic.twitter.com/OPfwM9kjqF
— IndianPremierLeague (@IPL) April 16, 2026
వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్(112 నాటౌట్) అజేయ సెంచరీతో గర్జించాడు. పంజాబ్ కింగ్స్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్(3-22) ధాటికి ఆదిలోనే రెండు వికెట్లు పడినా ఒత్తిడికి లోనవ్వని డికాక్.. నమన్ ధిర్(50)తో కలిసి శతక భాగస్వామ్యం నెలకొల్పాడు. పంజాబ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న ఈ ద్వయం ముంబై భారీ స్కోర్‌కు బాటలు వేసింది. వీరిద్దరి జోరుతో అలవోకగా రెండొందలు కొడుతుందనుకున్న ముంబై ఆఖర్లో తడబడింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా(14) మెరిసినా.. ముంబైని రెండొందల లోపే కట్టడి చేసింది పంజాబ్.
క్వింటన్ డికాక్(112 నాటౌట్)
