SRH vs CSK : సొంత మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) వరసగా రెండో మ్యాచ్ ఆడుతోంది. రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తుగా ఓడించి హైదరాబాద్ ఈసారి చెన్నై సూపర్ కింగ్స్(CSK) సవాల్‌కు సిద్ధమైంది. ఉప్పల్ వేదికగా జరుగుతున్న డబుల్ హెడర్ రెండో మ్యాచ్‌లో టాస్ గెలిచిన సీఎస్కే సారథి బౌలింగ్ తీసుకున్నాడు. చెపాక్‌లో రెండు విజయాలతో జోరందుకున్న సీఎస్కే హ్యాట్రిక్ కొట్టాలనుకుంటోంది. అయితే.. ఉప్పల్‌లో గత ఐదు మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 3 విజయాలతో చెన్నైపై ఆధిపత్యం చెలాయించింది.
పంతొమ్మిదో సీజన్‌ను ఓటమితో అరంభించి.. ఆపై కోల్‌కతాపై విజయంతో జోరందుకున్నట్టే కనిపించిన సన్‌రైజర్స్.. రాజస్థాన్‌పై భారీ విక్టరీతో రెండో విజయం నమోదు చేసింది. అరంగేట్ర పేసర్లు ప్రఫుల్ హింగే, షకీబ్ హుస్సేన్‌లు నాలుగేసి వికెట్లతో రెచ్చిపోయిన ఈ కుర్రాళ్లు చెన్నైపైనా తడాఖా చూపించేందుకు సిద్ధంగా ఉన్నారు. గాయం నుంచి కోలుకుంటున్న ఎంఎస్ ధోనీ ఈ గేమ్‌లోనూ ఆడడం లేదు. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ ఒక మారప్పు చేసింది. హర్ష్ దూబే స్థానంలో మధుషంకకు తుది జట్టులో చోటు దక్కింది.
🚨 Toss update from Hyderabad 🚨@ChennaiIPL won the toss and elected to field against @SunRisers
Updates ▶️ https://t.co/uJG04r8iXD #TATAIPL | #KhelBindaas | #SRHvCSK pic.twitter.com/fmh9iD0N4D
— IndianPremierLeague (@IPL) April 18, 2026
సన్‌రైజర్స్ తుది జట్టు : అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్), క్లాసెన్, సలీల్ అరోరా(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, నితీశ్ రెడ్డి, శివాంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, షకీబ్ హుస్సేన్, ఇషాన్ మలింగ,
ఇంప్యాక్ట్ సబ్స్ – స్మరణ్ రవిచంద్రన్, హర్ష్ దూబే, లివింగ్‌స్టోన్, మధుశనక, హర్షల్ పటేల్.
చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు : శాంసన్(వికెట్ కీపర్), గైక్వాడ్(కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, దూబే, బ్రెవిస్, ఓటర్టన్, షార్ట్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ముకేశ్ చౌదరీ, గుర్జప్నీత్ సింగ్.
ఇంప్యాక్ట్ సబ్స్ – ఆయుశ్ మాత్రే, కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్, రామకృష్ణ ఘోష్, మ్యాట్ హెన్రీ.