IPL 2026 : ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ మేనేజర్ రోమి భిందర్ (RomiBhinder)కు భారీ ఊరట లభించింది. ఐపీఎల్ కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన అతడిపై బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ(ACU) జాలి చూపించింది. డగౌట్లో ఫోన్ ఉపయోగించిన అతడికి భారీ ఫైన్ విధించడంతో పాటుమరోసారి అలాంటి తప్పు చేయకూడదని రోమిని హెచ్చరించింది. కోడ్ ఉల్లంఘించినందుకు రోమికి రూ.1 లక్ష జరిమానా విధించామని శుక్రవారం బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా (Devjit Saikia) వెల్లడించాడు.
గువాహటిలో ఏప్రిల్ 10న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి. మ్యాచ్ సమయంలో జట్టు సభ్యులు, కోచింగ్ సిబ్బందితో కలిసి డగౌట్ కూర్చున్న రాజస్థాన్ మేనేజర్ రోమి భిందెర్ ఫోన్ చూస్తూ కనిపించాడు. దాంతో, ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న రిఫరీ అతడిపై ఫిర్యాదు చేశాడు. అయితే.. తాను ఆరోజు మ్యాచ్ వేళ ఎందుకు ఫోన్ ఉపయోగించాల్సి వచ్చింది? అనేది అవినీతి నిరోధక శాఖకు రోమి వివరించాడు.
Romi Bhinder Likely to Escape with Warning or Fine
Rajasthan Royals manager Romi Bhinder is unlikely to face serious action from the BCCI’s ACSU for using a mobile phone in the dugout against RCB, as per Cricbuzz.
While his conduct was termed indiscreet, there’s no evidence of… pic.twitter.com/i4xp78UGdY
— Cricketopia (@CricketopiaCom) April 17, 2026
కానీ, అతడి వివరణతో పూర్తిగా సంతృప్తి చెందని అవినీతి నిరోధక విభాగం.. అతడిపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించింది. ఈ చర్యల్లో భాగంగానే రోమికి రూ.1 లక్ష జరిమానా పడిందని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా తెలిపాడు. మొదటి తప్పిదం కాబట్టి.. ఈసారి జరిమానాతో సరిపెట్టామని, మరోసారి నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రోమిని అవినీతి నిరోధక శాఖ హెచ్చరించింది. దాంతో, హమ్మయ్య బతికిపోయాను’ అని రాజస్థాన్ మేనేజర్ ఊపిరి పీల్చుకున్నాడు.
ఐపీఎల్ -19లో వైభవ్ సూర్యవంశీ మెరుపులతో వరసగా నాలుగు విజయాలు సాధించిన రాజస్థాన్ రాయల్స్ హైదరాబాద్లో మాత్రం తడబడింది. ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ కొత్త కుర్రాళ్లు ప్రఫుల్ హింగే, షకీబ్ హుస్సేన్లు తలా నాలుగేసి వికెట్లతో చెలరేగగా ఆ జట్టుకు తొలి ఓటమికి ఎదురైంది. ఆరెంజ్ ఆర్మీ నిర్దేశించిన 217 పరుగుల ఛేదనలో రాజస్థాన్ 159కే కుప్పకూలింది.
A truly spirited performance 🧡 pic.twitter.com/Xbjv3SsmfB
— SunRisers Hyderabad (@SunRisers) April 14, 2026