GT vs KKR : పంతొమ్మిదో సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆడిన ప్రతి మ్యాచ్ ఓడిపోతూనే ఉంది. ఇప్పటికే నాలుగింటా కంగుతిన్న కోల్‌కతాను ఉత్కంఠ పోరులో గుజరాత్ టైటాన్స్ మట్టికరిపించింది. కామెరూన్ గ్రీన్(79) మెరుపులతో గుజరాత్‌కు సవాల్ విసిరిన కోల్‌కతాను బౌలర్లు గట్టెక్కించలేదు. ఛేదనలో శుభ్‌మన్ గిల్ (86) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడగా.. రాణించారు. 5 వికెట్ల తేడాతో గుజరాత్ ఘన విజయం సాధించగా.. అజింక్యా రహానే సేన ఐదోసారి నిరాశతో మైదానం వీడింది.
మూడుసార్లు ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఈసారి ఎందుకనో అదృష్టం కలిసి రావడం లేదు. టోర్నీ ఆరంభం నుంచి బోణీ కోసం నిరీక్షిస్తున్న ఆ జట్టును గుజరాత్ టైటాన్స్ చిత్తుగా ఓడించింది. ఆఖరి ఓవర్ వరకూ పోరాడినా గెలుపు తలుపు మాత్రం తట్టలేకపోయింది కేకేఆర్. సొంత మైదానంలో పేసర్లు కగిసో రబడ(3-23), సిరాజ్(2-232)ల విజృంభణతో కోల్‌కతాను 180కే కట్టడి చేసిన గుజరాత్.. ఛేదనలో చెలరేగింది. ఓపెనర్ సాయి సుదర్శన్(22) విఫలమైనా.. శుభ్‌మన్ గిల్(86) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు.
Sumptous Strokes 🫡
🎥 Shubman Gill was at his fluent best en route his superb 8⃣6⃣(50) 😎
Updates ▶️ https://t.co/FACeUzse3B#TATAIPL | #KhelBindaas | #GTvKKR | @ShubmanGill pic.twitter.com/zzgu4kQikw
— IndianPremierLeague (@IPL) April 17, 2026
జోస్ బట్లర్(25)ను వరుణ్ చక్రవర్తి ఔట్ చేసినా గిల్ అర్ధ శతకంతో కోల్‌కతా ఆశలపై నీళ్లు చల్లాడు. వాషింగ్టన్ సుందర్(13), గ్లెన్ ఫిలిప్స్(19)తో కలిసి జట్టు విజయానికి పునాది వేశాడు. వైభవ్ అరోరా ఓవర్లో గ్రీన్ డైవింగ్ క్యాచ్‌తో గిల్‌ను వెనక్కి పంపాడు. అప్పటికీ గుజరాత్‌కు 23 రన్స్ కావాలంతే. రాహుల్ తెవాటియా() జతగా ఫిలిప్స్ గెలుపు బాధ్యత తీసుకున్నాడు. కార్తిక్ త్యాగి ఓవర్లో అతడు వరసగా రెండు ఫోర్లు బాదాడు. చివరి ఓవర్లో విజయానికి 5 పరుగులు అవసరమవ్వగా.. తొలి బంతికే ఫిలిప్స్ ఔటయ్యాడు. ఇంప్యాక్ట్ ప్లేయర్ షారుక్ ఖాన్, తెవాటియాలు పెద్ద షాట్లకు ప్రయత్నించకుండా సింగిల్స్, డబుల్స్ తీసి గుజరాత్‌ను గెలిపించారు.
ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన కామెరూన్ గ్రీన్(79) ఎట్టకేలకు చెలరేగాడు. అహ్మదాబాద్‌లో ఆదిలోనే కష్టాల్లో పడిన కోల్‌కతా నైట్ రైడర్స్‌ను అర్ధ శతకంతో ఆదుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ పేసర్లు రబడ(3-29), సిరాజ్(2-23)ల ధాటికి కోల్‌కతా టాపార్డర్ కుప్పకూలినా.. పావెల్(17)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.

ప్రసిధ్ కృష్ణ, అశోక్ శర్మలు సైతం ఇబ్బంది పెట్టగా.. రింకూ సింగ్(1), రమన్‌దీప్ సింగ్(17), సునీల్ నరైన్(0)లు విఫలమయ్యారు. ఓవైపు వికెట్లు పడుతున్నా రమన్‌దీప్ సింగ్(17) రాణించగా.. చివరిదాకా క్రీజులో నిలిచినా భారీ స్కోరందించలేకపోయాడు. రషీద్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్ ఆఖరి బంతికి అతడు వెనుదిరగగా కోల్‌కతా 180 పరుగులకు ఆలౌటయ్యింది.