Jaipur School Demolished | సీజేపీతో ఘర్షణ తర్వాత.. జైపూర్ పాఠశాల కూల్చివేత, త్వరలో కొత్త భవనం
Jaipur School Demolished | ‘పాఠశాలలను బాగు చేసుకుందాం’ ప్రచారంలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సభ్యులతో గ్రామస్తుల ఘర్షణ జరిగిన కొన్ని రోజుల తర్వాత రాజస్థాన్ రాజధాని జైపూర్ జిల్లాలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను కూల్చివేశారు. త్వరలో కొత్త స్కూల్ భవనాన్ని నిర్మించనున్నారు.
జైపూర్: ‘పాఠశాలలను బాగు చేసుకుందాం’ ప్రచారంలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సభ్యులతో గ్రామస్తుల ఘర్షణ జరిగిన కొన్ని రోజుల తర్వాత రాజస్థాన్ రాజధాని జైపూర్ జిల్లాలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను కూల్చివేశారు. బగ్రూ అసెంబ్లీ నియోజకవర్గంలోని రాంపురా కన్వర్పురా గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. (Jaipur School Demolished) త్వరలో కొత్త స్కూల్ భవనాన్ని నిర్మించనున్నారు. ఆగస్ట్ 23వ తేదీనే పాఠశాల కోసం జిల్లా మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ (డీఎంఎఫ్టీ) నిధుల నుంచి రూ.12 లక్షలు, ఎమ్మెల్యే స్థానిక అభివృద్ధి నిధి నుంచి రూ. 6 లక్షలు ఇప్పటికే ఆమోదించినట్లు ఎమ్మెల్యే కైలాష్ వర్మ తెలిపారు.
కాగా, రాంపురా కన్వర్పురా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. ఈ నేపథ్యంలో ఆ సమీపంలోని ఆవుల పాకలో పిల్లలకు క్లాసులు నిర్వహిస్తుండటం సీజేపీ దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆగస్ట్ 21న సీజేపీ ప్రతినిధి అశుతోష్, మరికొందరు సభ్యులు ‘స్కూల్ ఠీక్ కరో’ ప్రచారంలో భాగంగా ఆ ప్రభుత్వ స్కూల్ను సందర్శించేందుకు వెళ్లగా గ్రామస్తులు అడ్డుకున్నారు. సీజేపీ ప్రతినిధులపై దాడి చేయడంతో పాటు వారిని తిరిమికొట్టారు. సీజేపీ సభ్యులు, గ్రామస్తులకు మధ్య జరిగిన ఘర్షణపై ఇరుపక్షాల ఫిర్యాదులపై కేసులు నమోదయ్యాయి.
మరోవైపు ఆ ఘర్షణ తర్వాత సెప్టెంబర్ 1న కొత్త స్కూల్ భవన నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని రాజస్థాన్ సీఎం ప్రకటించారు. మంగళవారం ఆ పాఠశాలలో శుభ్రం చేసే పనులు మొదలయ్యాయని, కొత్త నిర్మాణానికి వీలుగా పాత భవనాన్ని కూల్చివేసే పనులు ప్రారంభమైనట్లు సీఎం బుధవారం ప్రకటించారు. సీజేపీ ప్రతినిధి అశుతోష్ దీనిపై స్పందించారు. వీడియో సందేశం ద్వారా రాజస్థాన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల నిర్మాణం జరుగాలన్నదే సీజేపీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
यह जयपुर के रामपुरा कंवरपुरा गांव की वहीं स्कूल है जहां 21 अगस्त को सीजेपी के @AshutoshRanka के जाने पर विवाद हुआ। अब स्कूल का काम शुरू हो चुका है। आज जर्जर भवन को गिराया गया।
सीजेपी वहां पहुंची, हंगामा हुआ। मैं पिछले साल यहां गया था, एक ग्राउंड रिपोर्ट करके आया था। हंगामे से… pic.twitter.com/qvRIbVopDU
— Vishwas Sharma (@VishwasSharma_) September 2, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్యార్డ్, ఎయిర్క్రాఫ్ట్ యార్డ్లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

