Irumudi 200 | మాస్ మహారాజా ర్యాంపేజ్.. రూ.200 కోట్ల క్లబ్లో రవితేజ ‘ఇరుముడి’!
Irumudi | టాలీవుడ్ బాక్సాఫీస్ ముందు మాస్ మహారాజా రవితేజ తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించారు. రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఇరుముడి’ (Irumudi).
Irumudi | టాలీవుడ్ బాక్సాఫీస్ ముందు మాస్ మహారాజా రవితేజ తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించారు. రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఇరుముడి’ (Irumudi). ఆగస్ట్ 21న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం, మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.
కేవలం మాస్ ప్రేక్షకులను మాత్రమే కాకుండా, మహిళలు, కుటుంబ సభ్యులు మరియు చిన్నారులను సైతం విపరీతంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సినిమా విడుదలైన రెండు వారాలు గడుస్తున్నప్పటికీ, వీకెండ్స్‌లోనే కాకుండా వీక్‌డేస్‌లో కూడా థియేటర్ల వద్ద ప్రేక్షకుల తాకిడి తగ్గకపోవడం విశేషం. ముఖ్యంగా శివ నిర్వాణ భావోద్వేగాలతో కూడిన స్క్రీన్ ప్లే, రవితేజ కెరీర్-బెస్ట్ పెర్ఫార్మెన్స్, మరియు గూస్బంప్స్ తెప్పించే ఎమోషనల్ సీన్స్ సినిమాను వేరే లెవెల్‌కు తీసుకెళ్లాయి. ‘స్వామి శరణం’ అనే ఆధ్యాత్మిక నేపథ్యంతో పాటు కుటుంబ బంధాల విలువలను కళ్లకు కట్టినట్లు చూపించడం వల్ల రిపీటెడ్ ఆడియెన్స్ విపరీతంగా పెరిగారు.
ఈ అద్భుతమైన ఆదరణతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ‘ఇరుముడి’ తాజాగా రూ. 200 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మైలురాయిని విజయవంతంగా దాటింది. దీంతో రవితేజ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవడమే కాకుండా, టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఒక సరికొత్త రికార్డును నమోదు చేసింది.
Every generation. Every theatre. One celebration. #Irumudi 💥
From kids to elders, from youth to families…. everyone celebrated #Irumudi, making it a 200 CR+ GROSS WORLDWIDE
GENERATIONAL BLOCKBUSTER 🔥
✨స్వామి శరణం✨
Go watch RAVANNA’s RAMPAGE in cinemas ❤️🔥… pic.twitter.com/bnao86ph3i
— Mythri Movie Makers (@MythriOfficial) September 2, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth vs Raja Gopal Reddy | రేవంత్ మెంటల్ స్టేటస్ బాలేదు.. సీఎంపై రాజగోపాల్ రెడ్డి మరోసారి విమర్శలు
Revanth Reddy | సిద్దిపేటలో సీఎం అబద్ధాల వరద.. అసలు నిజాలు ఏమిటో చర్చించుకుంటున్న జనం
Sampath Kumar | ఏఐసీసీ కార్యదర్శిగా సంపత్ ఔట్.. కమీషన్ల ఆరోపణల నేపథ్యంలోనే తొలగింపు?
Bigg Boss 10 | బిగ్ బాస్ హౌస్‌లో అమన్‌కు డబుల్ ధమాకా.. కొత్త కెప్టెన్‌గా విజయం,టికెట్ టు ఫినాలేకు నేరుగా ఛాన్స్!
Harish Rao | సిద్దిపేటలో పోటీకి నువ్వు సిద్ధమా.. ప్రజాక్షేత్రంలో నువ్వోనేనో తేల్చుకుందాం.. రేవంత్‌కు హరీశ్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

