IPL Tickets : ఐపీఎల్ టికెట్ల కోసం అభిమానులు ఎంతో శ్రమపడుతుంటారు. ఆన్లైన్లో, ఆఫ్‌లైన్‌లో టికెట్ల కోసం పోటీపడతారు. ఇదే అదనుగా కొందరు చేతివాటం చూపిస్తున్నారు. ఒక్కో టికెట్‌పై వేలకు వేలు దండుకుంటూ అవినీతికి తెరతీస్తున్నారు. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) మ్యాచ్ టికెట్లను ఓ వ్యక్తి బ్లాక్‌లో అమ్ముకున్నాడు. చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy Stadium) క్యాంటీన్లో పనిచేస్తున్న అతడు.. వంద టికెట్లను బ్లాక్‌లో భారీ ధరకు అమ్ముతూ పోలీసులకు చిక్కాడు.
నిరుడు తొక్కిసలాటతో క్రికెట్‌కు దూరమైన చిన్నస్వామి స్టేడియంలో పది నెలల తర్వాత ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఆర్సీబీ అదరగొడుతోంది. దాంతో, ఆ జట్టు మ్యాచ్ టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడతువుతున్నాయి. అయితే.. ఈ సమయంలోనే బ్లాక్ మార్కెట్లో టికెట్లు అమ్మకం కలకలం రేపింది. చిన్నస్వామి స్టేడియంలో ఏప్రిల్ 15న ఆర్సీబీ, లక్నో సూపర్ జెయింట్స్(LSG) తలపడ్డాయి. అక్కడి క్యాంటీన్లో పనిచేసే చంద్రశేఖర్ అనే వ్యక్తి ఈ మ్యాచ్ టికెట్లను బ్లాక్‌లో అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు.
Bengaluru canteen worker arrested for selling 100 RCB tickets on the black market#Bengaluru #RCB #Cricket | @SagayRajPhttps://t.co/GWYHcWrR3h
— IndiaToday (@IndiaToday) April 17, 2026
ఒక్కో టికెట్‌ను రూ.15,000 నుంచి రూ.19,000లకు అమ్ముతున్న అతడు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. అనంతరం విచారణలో కర్నాటక క్రికెట్ సంఘం (KSCA) సభ్యుల్లో ఒకడైన గణేశ్ పరీక్షిత్(Ganesh Parikshit) తనకు టికెట్లు ఇస్తాడని, తాను వాటిని బ్లాక్‌లో అమ్ముతానని చంద్రశేఖర్ వెల్లడించాడు. దాంతో, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్త వేగవంతం చేశారు. ప్రస్తుతం పరీక్షిత్ పరారీలో ఉండగా.. ఐపీఎల్ టికెట్లను బ్లాక్‌లో అమ్ముతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు కంపెనీలు, డైరెక్టర్లపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.