Ranganath | హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను వీలైనంత త్వరగా మరో శాఖకు బదిలీ చేయాలని హైకోర్టు రాష్ట్ర చీఫ్ సెక్రటరీని ఆదేశించింది. శాంతాశ్రీరామ్ కన్స్ట్రక్షన్ కంపెనీ కేసులో హైడ్రా కమిషనర్ కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని.. వివాదాస్పద ఆస్తిలోకి యంత్రాలు, సిబ్బందితో వెళ్లడం చట్టవిరుద్ధమని పేర్కొన్నది. చట్ట పరిధిలో మాత్రమే పాలన కొనసాగాలని, వ్యక్తుల ఆధిపత్యం పెరిగితే ప్రజాస్వామ్యానికి మరణ శాసనం అవుతుందని హెచ్చరించింది. ఆయన స్థానంలో మరొకరిని నియమించండి అని సీఎస్‌కు ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
రంగనాథ్‌ను వీలైనంత త్వరగా బదిలీ చేయండి.. హైకోర్టు ఆదేశాలు
చట్టపాలన మాత్రమే కొనసాగాలి.. వ్యక్తుల ఆధిపత్యం పెరిగితే ప్రజాస్వామ్యానికి మరణ శాసనం అవుతుంది
ఆయన స్థానంలో మరొకరిని నియమించండి.. సీఎస్‌కు సూచించిన హైకోర్టు
హైడ్రా, శాంతాశ్రీరామ్ కన్స్ట్రక్షన్ కంపెనీ కేసులో తెలంగాణ… https://t.co/ynh49PJyRt pic.twitter.com/jYiEIKAlyO
— Telugu Scribe (@TeluguScribe) July 31, 2026