హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహారంలో సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి చెంపపెట్టు లాంటిదని నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా పేరొన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ప్రతి ఎమ్మెల్యే విషయంలోనూ రాబోయే రోజుల్లో ఇదే తరహా రాజ్యాంగపరమైన పరిణామాలు, న్యాయపరమైన చికులు ఎదురుకావడం ఖాయమని హెచ్చరించారు.
రాజ్యాంగబద్ధమైన ప్రక్రియను, ప్రజాస్వామ్య విలువలను, న్యాయస్థానాల తీర్పులను కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవించాలని, బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించి ప్రజాతీర్పు కోరాలని డిమాండ్ చేశారు.