DC vs RCB : సొంత మైదానంలో వందో మ్యాచ్ ఆడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) అంచనా తప్పింది. భారీ స్కోర్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)ను భయపెట్టాలనుకున్న ఆర్సీబీకి ప్రధాన బ్యాటర్లు షాకిచ్చారు. ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ(19) తేలిపోగా.. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(63) ఒక్కడే అర్ధ శతకంతో మెరిశాడు. అక్షర్ పటేల్(2-18), కుల్దీప్ యాదవ్(2-32) తిప్పేయగా.. మిడిలార్డర్ డగౌట్‌కు క్యూ కట్టింది. డెత్ ఓవర్లలో దంచేయాలనుకున్న హిట్టర్లను నట్టూ, ఎంగిడి(2-39) అద్భుతంగా నియంత్రించారు. దాంతో, బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 8 నష్టానికి 175 పరుగులు చేసిందంతే.
టాస్ ఓడిన ఆర్సీబీకి సొంత గడ్డపై ఈసారి ఓపెనర్ విరాట్ కోహ్లీ(19) శుభారంభం ఇవ్వలేదు. షాట్లతో అలరించిన విరాట్‌ను ఔట్ చేసి ఢిల్లీకి బ్రేకిచ్చాడు. ఆ తర్వాత దేవ్‌దత్ పడిక్కల్(18) జతగా ఫిలిప్ సాల్ట్(63) స్కోర్ బోర్డును ఉరికించాడు. వీరిద్దరూ అటాకింగ్ గేమ్‌తో బౌండరీలు సాధించడంతో పవర్ ప్లేలో ఆర్సీబీ 59 పరుగులు స్కోర్ చేసింది. కానీ, అక్షర్ పటేల్(2-18) ఈ జోడీని విడదీసి పరుగుల వేగాన్ని నియంత్రించాడు.
విధ్వంసక ఆటతో స్కోర్ వంద దాటించిన సాల్ట్‌ను కుల్దీప్ యాదవ్ పెవిలియన్ పంపాడు.
Crucial wickets at the most crucial times 🫡
This is how #DC skipper Axar Patel shifted the momentum for his side 💪
Updates ▶️ https://t.co/vfJ6SccA9T#TATAIPL | #KhelBindaas | #RCBvDC | @DelhiCapitals | @akshar2026 pic.twitter.com/lkeZUjgSMx
— IndianPremierLeague (@IPL) April 18, 2026
కాసేపటికే ముకేశ్ కుమార్ ఓవర్లో రజత్ పాటిదార్(8) వికెట్ కీపర్ రాహుల్ చేతికి చిక్కాడు. అనంతరం టిమ్ డేవిడ్(26) కాసేపు బ్యాట్ ఝులిపించినా.. త్వరగానే వెనుదిరిగాడు. ఎంగిడి వేసిన ఓవర్లో జితేశ్ శర్మ(14) రెండు ఫోర్లు బాదాడు. కానీ, 19వ ఓవర్ల నట్టూ రెండే రన్స్ ఇచ్చాడు. ఎంగిడి వేసిన చివరి ఓవర్లో మూడో బంతికి కృనాల్ పాండ్యా రనౌటవ్వగా.. సిక్సర్‌కు యత్నించిన జితేశ్ బౌండరీ లైన్ వద్ద స్టబ్స్ చేతికి చిక్కాడు. దాంతో ఆర్సీబీ 8 వికెట్ల నష్టానికి 175 రన్స్‌కే పరిమితమైంది.