Mumbai Indians : ప్రతి సీజన్లో పంజా విసిరే ముంబై ఇండియన్స్(Mumbai Indians) గత రెండు సీజన్లుగా తేలిపోతోంది. పంతొమ్మిదో ఎడిషన్‌ను విజయంతో ఆరంభించినా వరసగా మూడు ఓటములతో ముంబై వెనకబడింది. సొంత మైదానమైన వాంఖడేలోనూ ముంబై పాచిక పారలేదు. లీగ్ దశలో తడబాటులో ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న వేళ కెప్టెన్సీ మార్పు అనివార్యమని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ (Manoj Tiwary) అంటున్నాడు. ఐదుసార్లు ఛాంపియన్ మళ్లీ మునపటి జోరందుకోవాలంటే రోహిత్ శర్మ(Rohit Sharma)కు తిరిగి సారథ్యం అప్పగించాలని తివారీ అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ హవానే వేరు. ఏకంగా ఐదుసార్లు టైటిల్ విజేతగా నిలిచిన ముంబై ఈమధ్య కాలంలో తడబడుతోంది. టీ20 సారథిగా మెప్పించిన హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఆ జట్టు పేలవమైన ఆటతో నిరాశపరుస్తోంది. పంతొమ్మిదో సీజన్లో ఈ మేటి జట్టు ఒకేఒక విజయంతో ప్లే ఆఫ్స్ రేసులో ఆమడ దూరంలో ఉంది. వాంఖడేలో పంజాబ్ కింగ్స్ చేతిలో 7 వికెట్ల తేడాతో హార్దిక్ పాండ్యా బృందం ఓటమిని అభిమానులే కాదు ఫ్రాంచైజీ జీర్ణించుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ మార్పుతోనే ముంబై మళ్లీ విజయాల తోవ తొక్కుతుందని మనోజ్ తివారీ అంటున్నాడు. క్రిక్‌బజ్‌తో మాట్లాడిన తివారీ.. మళ్లీ రోహిత్‌ను కెప్టెన్ చేయాలని సూచించాడు.
Manoj Tiwary 🗣️: Hardik Should Step Down And Captaincy Should Be Given Back To Rohit Sharma
“One side, Shreyas Iyer has shown outstanding captaincy for Punjab Kings… he has led from the front.
On the other side, Mumbai Indians’s captaincy has looked very weak.
I feel that if… pic.twitter.com/cIz4sWYnPV
— Rohan💫 (@rohann__45) April 17, 2026
‘యాజమాన్యం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతి ఒక్కరు తమను తాము ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీరు ఎలా ఆడుతున్నారు? అనేది గమనించాలి. ఈ ఒక్క ఏడాది మీరు బాగా ఆడడం లేదంటే ఈ తప్పు ఈసారి జరిగిందని కాదు. మీ మూలాలను కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. 2015 నుంచి 2023 వరకూ రోహిత్ సారథ్యంలో ముంబై ఐదుసార్లు ట్రోఫీని ఒడిసిపట్టింది. ఒక కెప్టెన్సీ విషయానికొస్తే.. శ్రేయస్ అయ్యర్ అద్భుతం. అదే ముంబై నాయకుడు మాత్రం వ్యూహాలు పన్నడంలో చాలా బలహీనంగా కనిపిస్తున్నాడు. ఈ సమస్యకు పరిష్కారం ఏంటంటే పాండ్యాను కెప్టెన్సీ నుంచి తప్పించాలి. మళ్లీ రోహిత్‌కే ముంబై పగ్గాలు అప్పగించాలి. ముంబై యాజమాన్యం రోహిత్‌ను సారథిగా తప్పించి అతడికి అన్యాయం చేసింది’ అని మనోజ్ తివారీ పేర్కొన్నాడు.
Manoj Tiwary calls on Hardik Pandya to hand over the MI captaincy back to Rohit Sharma with the team failing to match up to their lofty standards.#IPL2026 #MI #MumbaiIndians pic.twitter.com/FYZeGJf3Jd
— Circle of Cricket (@circleofcricket) April 17, 2026
అయితే.. 19వ సీజన్లో ముంబై వైఫల్యానికి బాధ్యత పాండ్యా ఒక్కడే కాదని జట్టు మొత్తం తీసుకుంటుందని హెడ్‌కోచ్ మహేల జయవర్ధనే అన్నాడు. దాంతో, పాండ్యాను ఇప్పటికిప్పుడు సారథిగా తప్పించడం లేదనే సంకేతాల్ని ఇచ్చాడు జయవర్ధనే.