Ujjaini Mahankali Temple | మీరు నా మాట వినట్లేదు.. నేను సంతోషంగా రాలేదు.. భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత
Ujjaini Mahankali Temple | సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి(రంగం) వినిపించారు. మీరెవరూ నేను చెప్పింది ఏదీ ఆచరించడం లేదంటూ మాతంగి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Ujjaini Mahankali Temple | సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి(రంగం) వినిపించారు. మీరెవరూ నేను చెప్పింది ఏదీ ఆచరించడం లేదంటూ మాతంగి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడకు నేను సంతోషంగా రాలేదు.. క్రోధంతో వచ్చానని అన్నారు. మీ ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పాలని నిలదీశారు. నా విగ్రహం ప్రతిష్ట చేస్తానని మాట ఇచ్చి జరిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏ ఆపద వచ్చినా.. ప్రమాదం వచ్చినా కాపాడుతున్నానని మాతంగి స్వర్ణలత తెలిపారు. కానీ మీరు చేసే చర్యలే నాకు ఆగ్రహం తెప్పిస్తుందని అన్నారు. వావివరసలు లేకుండా ఘోరాలు జరుగుతున్నాయని.. అలాంటి వారిని వదిలిపెట్టనని అన్నారు. వారిని పాదాల కింద నలిపేస్తానని అన్నారు. ఈ ఏడాది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాతంగి భవిష్యవాణిలో చెప్పారు.ఈ ఏడాది కుంభవర్షాలు ఉన్నాయని తెలిపారు. అగ్నిప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయని చెప్పారు. ఈ ఏడాది ప్రాణనష్టం భారీగా జరుగుతుందని అన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
కొంతమంది కళ్లు నెత్తికెక్కి ప్రవర్తిస్తున్నారని మాతంగి స్వర్ణలత ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ప్రవర్తన తనకు సంతోషం కలిగించడం లేదని తెలిపారు. విగ్రహ ప్రతిష్ట చేయిస్తానని మాట ఇచ్చారని.. కానీ మాట నిలబెట్టుకోవడం లేదని అన్నారు. విగ్రహ ప్రతిష్టకు ఎవరు అడ్డువచ్చినా ఊరుకోనని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

