GT vs KKR : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ ఆరంభంలోనే కష్టాల్లో పడింది. 32 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లోనే అజింక్యా రహానే(0)ను సిరాజ్ వెనక్కి పంపగా.. కాసేపటికే రబడ బౌలింగ్‌లో రఘువంశీ(8) వికెట్ కీపర్ బట్లర్ చేతికి చిక్కాడు. దాంతో.. 21కే కోల్‌కతా రెండో వికెట్ కోల్పోయింది. కామెరూన్ గ్రీన్(3 నాటౌట్)తో కలిసి జట్టును ఆదుకోవాలనుకున్న టిమ్ సీఫర్ట్(19)ను రబడ నాలుగో ఓవర్ చివరి బంతికి పెవిలియన్ చేర్చాడు.
వరస ఓటములతో సతమతమవుతున్న కోల్‌కతా ఆట మారడం లేదు. అహ్మదాబాద్‌లో టాస్ గెలిచిన ఆ జట్టు పవర్ ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే రహానే(0)ను సిరాజ్ గోల్డెన్ డక్‌గా వెనక్కి పంపాడు. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే రఘువంశీ(8)ని రబడ ఔట్ చేశాడు. రఘువంశీ షాట్ ఆడాలనుకోగా.. ఔట్ సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతిని వికెట్ కీపర్ బట్లర్ అందుకున్నాడు. ఈ క్యాచ్‌తో బట్లర్ టీ20ల్లో మూడొందల క్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు.
Mohd. Siraj and #GT are up and running 🥳#KKR captain Ajinkya Rahane departs ☝️
Updates ▶️ https://t.co/FACeUzse3B#TATAIPL | #KhelBindaas | #GTvKKR | @mdsirajofficial pic.twitter.com/7LWnHdfl3T
— IndianPremierLeague (@IPL) April 17, 2026
కామెరూన్ గ్రీన్(3 నాటౌట్) జతగా దూకుడుగా ఆడుతున్న టిమ్ సీఫర్ట్(19)ను రబడ బోల్తా కొట్టించాడు. సీఫర్ట్ నేరుగా ఫిలిప్స్ చేతికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో, 4 ఓవర్లకు కోల్‌కతా మూడు వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది.