Gujarat Titans : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్లో గాయాల బారిన ఆటగాళ్ల స్థానంలో కొత్తవాళ్లు అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇప్పటికే ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ స్క్వాడ్‌లో మార్పులు చేయగా.. గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) సైతం కొత్త కుర్రాడిని తీసుకుంది. గాయపడిన టామ్ బ్యాంటన్ (Tom Banton) స్థానంలో కొన్నొర్ ఎస్టెర్హుజెన్(Connor Esterhuizen)ను స్క్వాడ్‌లో చేర్చుకుంది గుజరాత్. చెన్నై సూపర్ కింగ్స్ సైతం ప్రధాన పేసర్ ఖలీల్ అహ్మద్ స్థానాన్ని ముంబై పేసర్ ఆకాశ్ మధ్వాల్‌తో భర్తీ చేసింది.
పంతొమ్మిదో సీజన్లో నిరాశపరుస్తున్న గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ స్క్వాడ్‌లో మార్పులు చేసింది. వేలిగాయంతో బాధ పడుతున్న టామ్ బ్యాంటన్ స్థానంలో దక్షిణాఫ్రికా చిచ్చరపిడుగు కొన్నొర్ ఎస్టెర్హుజెన్తో ఒప్పందం కుదుర్చుకుంది గుజరాత్. పొట్టి క్రికెట్ సంచలనంగా పేరొందిన ఈ కుర్రాడు ఇటీవల కివీస్ గడ్డపై రెచ్చిపోయాడు.
Welcoming you from every 𝘾𝙤𝙣𝙣𝙤𝙧 of Gujarat 💙 pic.twitter.com/mftKsQHetE
— Gujarat Titans (@gujarat_titans) April 17, 2026
అరంగేట్రం సిరీస్‌లో ఆడిన ఐదు మ్యాచుల్లో 145.98 స్ట్రయిక్ రేటుతో 200 పరుగులు సాధించి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డను అందుకున్నాడు కొన్నొర్. స్వదేశంలో జరిగే ఎస్ఏ20లో ఎంఐ కేప్‌టౌన్, ప్రిటోరియా క్యాపిటల్స్‌కు ఆడిన అనుభవం కొన్నొర్కు ఉంది. దాంతో.. బ్యాంటన్ స్థానంలో దూకుడుగా ఆడగల ఈ కుర్రాడిని ర.75 లక్షల కనీస ధరకు సొంతం చేసుకుంది గుజరాత్.
వరసగా రెండు విజయాలతో జోరుమీదున్న చెన్నై సూపర్ కింగ్స్ స్క్వాడ్‌లోకి ఆకాశ్ మధ్వాల్ వచ్చాడు. మ్యాచ్‌లో గాయపడి టోర్నీ మొత్తానికి దూరమైన ఖలీల్ అహ్మద్ స్థానంలో ఈ కుర్రాడికి చోటు దక్కింది. కుడిచేతి వాటం పేసరైన మధ్వాల్ డెత్ ఓవర్లలో వికెట్లు తీయడంలో దిట్ట. 2023 సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగిన ఈ కుర్రాడు 8 మ్యాచుల్లో 14 వికెట్లతో సత్తా చాటాడు. ఎలిమినేటర్‌లో గుజరాత్‌పై 5/5తో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడీ స్పీడ్‌స్టర్.
🚨 BIG UPDATE ON CSK 🚨
– As we informed yesterday, Akash Madhwal was set to join CSK, and that is exactly what has happened. Akash Madhwal has already joined the Chennai Super Kings team in Hyderabad. pic.twitter.com/XKwkvmUNNj
— lndian Sports Netwrk (@IS_Netwrk29) April 17, 2026