దేవరకొండ రూరల్, సెప్టెంబర్ 02 : కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన FRAME WORK FOR FERTILIZER SALES (FFS) యాప్‌పై దేవరకొండ మండలం దుబ్బతండాలో రైతులకు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవరకొండ ఏఓ కె.రవి కుమార్ మాట్లాడుతూ.. ఇక నుండి రైతులు ఈ యాప్ ద్వారానే వారికి కావాల్సిన అన్ని రకాల ఎరువులను కొనుగోలు చేసుకొనవచ్చని తెలిపారు. యాప్ ఏ విధంగా పని చేస్తుందో ప్రత్యక్షంగా వివరించారు. తరువాత ఎల్‌నినో ప్రభావం గురించి వివరించారు. రైతులు తక్కువ నీటితో పండే స్వల్పకాలిక పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. పెసర, మినుము, నువ్వులు, అలసందలు మొదలైన పంటలు సాగు చేసుకోవాలన్నారు. ప్రతీ రైతు వారు వేసిన పంటలను డిజిటల్ క్రాప్ సర్వే(DCS) లో నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పంచాయతీ సెక్రటరీ సమ్రీన్, ఉప సర్పంచ్ ఇస్లావత్ జీవన్, ఫీల్డ్ అసిస్టంట్ సఖ్య నాయక్, గ్రామ పెద్దలు పిక్కు నాయక్, ఇస్లావత్ లక్ష్మణ్, బాలోజీ నాయక్, పలువురు రైతులు పాల్గొన్నారు.