Scheme | చదువు కోసం అయ్యే ఖర్చుల్లో విద్యార్థులకు అండగా ఉండేందుకు ఢిల్లీ యూనివర్సిటీ (University of Delhi) ఒక స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఫైనాన్షియల్ సపోర్ట్ స్కీమ్ (FSS) పేరుతో దీన్ని 2026-27 విద్యాసంవత్సరం చదువుతున్న విద్యార్థుల కోసం ప్రవేశపెట్టింది. దీన్ని డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ (DSW) కార్యాలయం ద్వారా అమలు చేస్తున్నారు. ఇది కుటుంబ ఆదాయం ఆధారంగా అర్హత కలిగిన విద్యార్థులకు ఫీజు మినహాయింపులను కల్పిస్తుంది.
ఎవరు అర్హులు
ఈ స్కీమ్ ఢిల్లీ యూనివర్సిటీలోని ఏ విభాగంలోనైనా, సంస్థలోనైనా అండ్గ్రాడ్యుయేట్ (UG), పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) చదువుతున్న ఫుల్‌టైమ్ విద్యార్థులకు వర్తిస్తుంది. బీటెక్, బీఈ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా ప్రోగ్రామ్‌లు, స్కూల్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్ (SOL), నాన్ కాలేజియేట్ ఉమెన్స్ ఎడ్యుకేషన్ బోర్డ్ (NCWEB)లో చదువుతున్నవారికి ఇది వర్తించదు. గతంలో జరిగిన ఏ పరీక్షలోనైనా ఎసెన్షియల్ రిపీట్ (ER) ఉన్న విద్యార్థులను ఈ పథకం నుంచి మినహాయించారు.

Fss
విభాగాలు
ఈ పథకాన్ని రెండు విభాగాలు విభజించారు. ప్రతి వర్గానికి వేర్వేరు ఫీజు మినహాయింపు ప్రయోజనాలకు కల్పించారు. కుటుంబ వార్షికాదాయం రూ. 4 లక్షల్లోపు ఉన్న విద్యార్థులు కేటగిరీ-1లోకి వస్తారు. వీరికి గరిష్ఠంగా రూ. 15,000 వరకు వంద శాతం ఫీజు మినహాయింపు లభిస్తుంది. కుటుంబ వార్షికాదాయం రూ. 8 లక్షల్లోపు ఉన్న విద్యార్థులను కేటగిరీ-2లోకి వస్తారు. వీరికి గరిష్ఠంగా రూ. 10,000 వరకు యాభై శాతం ఫీజు మినహాయింపు దక్కతుంది.
సర్టిఫికెట్లు
ఈ స్కీమ్ పొందాలనుకునే విద్యార్థులు కింది ధ్రువపత్రాల (Certificates)ను సమర్పించాలి.
ఈడబ్ల్యూఎస్/ఓబీసీ-ఎన్సీఎల్ సర్టిఫికెట్ లేదా కుటుంబ వార్షికాదాయ ఇన్కమ్ సర్టిఫికెట్. ఇవి సంబంధిత అధదికారి నుంచి 2025-26 సంవత్సరానికి జారీ చేసినవి అయి ఉండాలి. నోటరీ అధికారి జారీ చేసిన లేదా విద్యార్థి పేరుమీద ఉన్న ఇన్కమ్ సర్టిఫికెట్లు చెల్లవు.
అభ్యర్థి తాజా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్‌లతో పాటు కుటుంబ సభ్యుల PAN కార్డులు.
హామీ పత్రం, సంస్థ అధిపతి లేదా డైరెక్టర్ సంతకం చేసిన బోనఫైడ్ సర్టిఫికెట్.
గత పరీక్ష ధ్రువపత్రం.
తాజా ఫీజు రసీదు, IFSC కోడ్ కనిపించేలా ఉన్న బ్యాంక్ పాస్‌బుక్.
చివరితేదీ
దరఖాస్తులు సమర్పించడానికి చివరితేదీ అక్టోబర్ 13. సంబంధిత పత్రాలను ఆఫ్‌లైన్‌లో సమర్పించే షెడ్యూల్‌ను DSW వెబ్సైట్లో ప్రకటిస్తారు. వీటికోసం ఈ వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ ఉండాలి.

Students