GT vs KKR | టాస్ గెలిచిన కోల్‌కతా.. విధ్వంసక ఓపెనర్‌పై వేటు..!
GT vs KKR : గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) జట్టుతో కోల్‌కతా తలపడుతోంది. నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన అజింక్యా రహానే బ్యాటింగ్ తీసుకున్నాడు.
GT vs KKR : పంతొమ్మిదో సీజన్లో ఇప్పటివరకూ గెలుపు తోవ తొక్కని కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) అహ్మదాబాద్‌లో బిగ్ ఫైట్‌కు సిద్ధమైంది. గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) జట్టుతో కోల్‌కతా తలపడుతోంది. నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన అజింక్యా రహానే బ్యాటింగ్ తీసుకున్నాడు. బోణీ కొట్టాలనే కసితో ఉన్న కేకేఆర్ ఆతిథ్య జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలని భావిస్తోంది.
వరస ఓటములతో కుదేలైన కోల్‌కతా తొలి విజయంపై కన్నేసింది. ఓపెనర్‌గా విఫలమవుతున్న ఫిన్ అలెన్ స్థానంలో టిమ్ సీఫ్ట్ తుది జట్టులోకి వచ్చాడు. నాలుగు మ్యాచుల్లో రెండింట మాత్రమే గెలిచిన శుభ్‌మన్ గిల్ సేన ఆరో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు బోణీ కోసం నిరీక్షిస్తున్న కోల్‌కతా అట్టడుగున ఉంది.
🚨Toss update from Ahmedabad🚨@KKRiders won the toss and elected to bat first against @gujarat_titans
Updates ▶️ https://t.co/FACeUzse3B#TATAIPL | #KhelBindaas | #GTvKKR pic.twitter.com/1IPWIZTZXC
— IndianPremierLeague (@IPL) April 17, 2026
గుజరాత్ తుది జట్టు : శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), సుందర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అశోక్ శర్మ, రబడ, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ.
ఇంప్యాక్ట్ సబ్స్ – హోల్డర్, షారుక్ ఖాన్, మానవ్ సుతార్, కుల్వంత్ ఖెజ్రోలియా, అనుజ్ రావత్.
కోల్‌కతా తుది జట్టు : టిమ్ సీఫర్ట్, సునీల్ నరైన్, అజింక్యా రహానే(కెప్టెన్), కామెరూన్ గ్రీన్, రఘువంశీ(వికెట్ కీపర్), పావెల్, రమన్‌దీప్, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తిక్ త్యాగి.
ఇంప్యాక్ట్ సబ్స్ – వరుణ్ చక్రవర్తి, ఫిన్ అలెన్, తేజస్వీ దహియా, నవ్‌దీప్ సైనీ, మనీశ్ పాండే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

