MI vs PBKS : వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్(112 నాటౌట్) అజేయ సెంచరీతో గర్జించాడు. పంజాబ్ కింగ్స్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్(3-22) ధాటికి ఆదిలోనే రెండు వికెట్లు పడినా ఒత్తిడికి లోనవ్వని డికాక్.. నమన్ ధిర్(50)తో కలిసి శతక భాగస్వామ్యం నెలకొల్పాడు. పంజాబ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న ఈ ద్వయం ముంబై భారీ స్కోర్‌కు బాటలు వేసింది. వీరిద్దరి జోరుతో అలవోకగా రెండొందలు కొడుతుందనుకున్న ముంబై ఆఖర్లో తడబడింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా(14) మెరిసినా.. ముంబైని రెండొందల లోపే కట్టడి చేసింది పంజాబ్.
సొంత మైదానంలో చెలరేగిపోవాలనుకున్న ముంబై ఇండియన్స్‌కు పవర్ ప్లేలోనే అర్ష్‌దీప్ సింగ్(3-22) ఊహించని షాకిచ్చాడు. వరస బంతుల్లో రియాన్ రికెల్టన్(2), సూర్యకుమార్ యాదవ్(0)ను ఔట్ చేసి హ్యాట్రిక్‌పై నిలిచాడు. అయితే.. నమన్ ధిర్(50) వికెట్ కాపాడుకున్నాడు. కానీ, కాసేపటికే చాహల్ క్యాచ్ జారవిడవడంతో బతికిపోయిన నమన్ ఆ తర్వాత బౌండరీలతో రెచ్చిపోయాడు. పంజాబ్ బౌలర్లను ఉతికేస్తూ మూడో వికెట్‌కు క్వింటన్ డికాక్(112 నాటౌట్)తో కలిసి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి ముంబై భారీ స్కోర్‌కు బాటలు వేశాడు.
What a player, what a knock, and what a way to start the season! 💯
Quinton de Kock, take a bow for a truly special Wankhede hundred! 👏
Updates ▶️ https://t.co/Fn2dxJ4zYR#TATAIPL | #KhelBindaas | #MIvPBKS | @mipaltan pic.twitter.com/jEhH1ofb1z
— IndianPremierLeague (@IPL) April 16, 2026
నమన్ ఔటయ్యాక శశాంక్ సింగ్ ఓవర్లో వరసగా రెండు సిక్సర్లు బాదిన డికాక్ శతకం సాధించాడు. పంతొమ్మిదో సీజన్లో రెండో సెంచరీ బాదిన ఆటగాడిగా డికాక్ గుర్తింపు సాధించాడు. అయితే.. యాన్సెన్ ఓవర్లో రెండు సిక్సర్లతో విరుచుకుపడిన హార్దిక్ పాండ్యా(14)ను బౌండరీ లైన్ వద్ద శ్రేయాస్ అయ్యర్ కళ్లు చెదిరే క్యాచ్‌తో పెవిలియన్ పంపాడు. ఆ వెంటనే రూథర్‌ఫోర్డ్, ఓవర్లో తిలక్ వర్మ(8)లు ఔట్ కావడంతో రెండొందలకు పైగా కొడుతుందనుకున్న ముంబై 196కే పరిమితమైంది.