GT vs KKR : ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన కామెరూన్ గ్రీన్(79) ఎట్టకేలకు చెలరేగాడు. అహ్మదాబాద్‌లో ఆదిలోనే కష్టాల్లో పడిన కోల్‌కతా నైట్ రైడర్స్‌ను అర్ధ శతకంతో ఆదుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ పేసర్లు రబడ(29-3), సిరాజ్(2-23)ల ధాటికి కోల్‌కతా టాపార్డర్ కుప్పకూలినా.. పావెల్(17)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. చివరిదాకా క్రీజులో నిలిచినా భారీ స్కోరందించలేకపోయాడు. రషీద్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్ ఆఖరి బంతికి అతడు వెనుదిరగగా కోల్‌కతా 180 పరుగులకు ఆలౌటయ్యింది.
అహ్మదాబాద్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ పోరాడగలిగే స్కోర్ చేసింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే రహానే(0)ను సిరాజ్ గోల్డెన్ డక్‌గా వెనక్కి పంపాడు. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే రఘువంశీ(8)ని రబడ ఔట్ చేశాడు. రఘువంశీ షాట్ ఆడాలనుకోగా.. ఔట్ సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతిని వికెట్ కీపర్ బట్లర్ అందుకున్నాడు. ఈ క్యాచ్‌తో బట్లర్ టీ20ల్లో మూడొందల క్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. కామెరూన్ గ్రీన్(79) జతగా దూకుడుగా ఆడుతున్న టిమ్ సీఫర్ట్(19)ను రబడ బోల్తా కొట్టించాడు. సీఫర్ట్ నేరుగా ఫిలిప్స్ చేతికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
A missed chance followed by a strike ⚡️
That’s how Rashid Khan wrapped up the #KKR innings 😎
SCORECARD ▶️ https://t.co/FACeUzse3B#TATAIPL | #KhelBindaas | #GTvKKR pic.twitter.com/yfkNVNV2SG
— IndianPremierLeague (@IPL) April 17, 2026
రబడ, సిరాజ్ నిప్పులు చెరగడంతో 32 పరుగులకే మూడు వికెట్లు పడిన వేళ.. రొవ్మన్ పావెల్(17) జతగా గ్రీన్ కోల్‌కతాను ఆదుకున్నాడు. ఈ సీజన్లో తొలి అర్ధ శతకం బాదిన గ్రీన్‌కు సహచరుల నుంచి సహకారం అందలేదు. ప్రసిధ్ కృష్ణ, అశోక్ శర్మలు సైతం ఇబ్బంది పెట్టగా.. రింకూ సింగ్(1), రమన్‌దీప్ సింగ్(17), సునీల్ నరైన్(0)లు విఫలమయ్యారు. డెత్ ఓవర్లలో గేర్ మార్చాలనుకున్న గ్రీన్‌కు గుజరాత్ బౌలర్లు చెక్ పెట్టగా.. కోల్‌కతా 180కి ఆలౌటయ్యింది.
Innings Break!
Cameron Green’s fighting 79 takes #KKR to 180 👏
Will #GT chase this down? 🤔
SCORECARD ▶️ https://t.co/FACeUzse3B#TATAIPL | #KhelBindaas | #GTvKKR pic.twitter.com/dKw3HijinF
— IndianPremierLeague (@IPL) April 17, 2026