ఢిల్లీ: సన్‌రైజర్స్ అభిమానులకు శుభవార్త! వెన్నునొప్పికి శస్త్రచికిత్స, అనంతర పరిణామాలతో గత జులై నుంచి ఆటకు దూరమైన ఆస్ట్రేలియా సారథి పాట్ కమిన్స్ ఐపీఎల్‌లోకి పునరాగమనం చేయనున్నాడు. ఈనెల 25న అతడు.. జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని సమాచారం.
2026 సీజన్ ఆరంభం నుంచి జట్టుతోనే ఉన్న అతడు.. వైద్య పరీక్షల నిమిత్తం ఇటీవలే స్వదేశానికి వెళ్లిన విషయం తెలిసిందే. పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించిన కమిన్స్ మ్యాచ్‌లు ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. ఇదిలాఉండగా పైన్ కాలి మడమ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగినట్టు ఒక ప్రకటనలో తెలిపింది.