కొలంబో: కొలంబలో భారత్‌తో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్(India vs Sri Lanka XI)లో శ్రీలంక లెవన్ జట్టు మొదటి రోజు భోజన విరామ సమయానికి వికెట్ నష్టానికి 138 రన్స్ చేసింది. తొలుత టాస్ గెలిచిన శ్రీలంక లెవన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకున్నది. మొదటి వికెట్‌కు నిషాన్ మధుష్క, రవిందు రసంత 110 రన్స్ జోడించారు. 66 రన్స్ చేసిన నిషాన్ రనౌట్ అయ్యాడు. ప్రస్తుతం మూడో నెంబర్ బ్యాటర్ పసిందు సూర్యబందర క్రీజ్‌లో ఉన్నాడు. భారత జట్టు కెప్టెన్ శుభమన్ గిల్ గాయం కారణంగా టాస్కు వెళ్లలేదు. కేఎల్ రాహుల్ టాస్‌లో పాల్గొన్నాడు. ఓపెనర్ రవిందు 50 రన్స్ చేసి క్రీజ్‌లో ఉన్నాడు. ఉదయం భారత స్పీడ్ బౌలర్లు రాణించలేదు. సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ, గుర్నూర్ బ్రార్ వికెట్లు తీయలేకపోయారు. స్పిన్‌కు పిచ్ అనుకూలించినా.. వికెట్లు మాత్రం పడలేదు.