DC vs RCB | పవర్ ప్లేలో నిప్పులు చెరిగిన భువనేశ్వర్.. కష్టాల్లో ఢిల్లీ..!
DC vs RCB : చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ పేసర్ భువనేశ్వర్(3-9) నిప్పులు చెరిగాడు. 176 పరుగుల ఛేదనలో మొదటి ఓవర్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాకిచ్చాడు
DC vs RCB : చిన్నస్వామి స్టేడియంలో కొత్త బంతితో ఆర్సీబీ పేసర్ భువనేశ్వర్(3-9) నిప్పులు చెరిగాడు. 176 పరుగుల ఛేదనలో మొదటి ఓవర్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాకిచ్చాడు భువి. ఓపెనర్ పథుమ్ నిశాంక(1)ను ఎల్బీగా వెనక్కి పంపిన ఈ సీనియర్ బౌలర్.. ఆ తర్వాతి ఓవర్లో రెండు వికెట్లతో ఢిల్లీని ఒత్తిడిలో పడేశాడు. ఇంప్యాక్ట్ సబ్ కరుణ్ నాయర్(5), ఈ సీజన్లో దంచేస్తున్న కుర్రాడు సమీర్ రిజ్వీ(2)ను పెవిలియన్ పంపిన భువనేశ్వర్ ఆర్సీబీకి అదిరే ఆరంభమిచ్చాడు.
ఆర్సీబీని 175కే కట్టడి చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు తొలి ఓవర్లోనే ఊహించని ఝలక్ ఇచ్చాడు భువనేశ్వర్ (3-9). తొలి ఓవర్లోనే డేంజరస్ పథుమ్ నిశాంక(1)ను వికెటల్ ముందు దొరకబుచ్చుకున్న ఈ స్వింగ్ కింగ్.. తన రెండో ఓవర్లో ఢిల్లీని మరింత కష్టాల్లోకి నెట్టాడు. ఇంప్యాక్ట్ సబ్ కరుణ్ నాయర్(5), సమీర్ రిజ్వీ(2)లను ఔట్ చేసిన భువి.. బెంగళూరుకు అవకాశాలు సృష్టించాడు.
Soaking up the early pressure out in the middle 💪
Will the birthday boy KL Rahul stay till the end and take #DC home? 🎂
Updates ▶️ https://t.co/vfJ6SccA9T#TATAIPL | #KhelBindaas | #RCBvDC | @DelhiCapitals | @klrahul pic.twitter.com/mI0iXeI1na
— IndianPremierLeague (@IPL) April 18, 2026
అయితే.. ఆరంభంలోనే మూడు వికెట్లు పడిన ఢిల్లీని కేఎల్ రాహుల్(31 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్(9 నాటౌట్) ఆదుకునే పనిలో ఉన్నారు. హేజిల్‌వుడ్ వేసిన ఓవర్లో రెచ్చిపోయిన బర్త్ డే బాయ్ 6, 4, 4 తో స్కోర్ 40 దాటించాడు. పవర్ ప్లేలో ఢిల్లీ మూడు వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

